ONGC Gas Leak: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం పరిధిలోని మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో తీవ్ర భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామ సమీపంలో ఉన్న ఓఎన్‌జిసి (ONGC) గ్యాస్ బావిలో లీక్ జరగడంతో ఒక్కసారిగా భారీ ఎత్తున క్రూడ్ ఆయిల్ కలిసిన గ్యాస్ ఎగజిమ్మింది. ఉత్పత్తిలో ఉన్న బావి అకస్మాత్తుగా ఆగిపోవడంతో వర్క్ ఓవర్ రిగ్ ద్వారా మరమ్మత్తు పనులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. Kurnool Kandhanathi:…
కోనసీమలో ఓఎన్జీసీ బావి నుంచి భారీగా గ్యాస్ లీకేజ్ కలకలం సృష్టించింది. ఒ ఎన్ జి సి అధికారులకు సమాచారం అందించారు స్థానికులు. బ్లో అవుట్ తరహాలో మంటలు కూడా రావడంతో అదుపు చేసేందుకు వెళ్లిన ONGC సిబ్బంది పరుగులు తీశారు. రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలోని ONGC బావి వద్ద మధ్యాహ్నం 12 గంటల సమయంలో పేలుడు జరిగిన క్రమంలో గ్యాస్ పైప్ లైన్ నుంచి ఈ లీకేజ్ సంభవించింది. భారీగా గ్యాస్…
Antarvedi Beach: న్యూ ఇయర్ వేళ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేదిలో విషాదం నెలకొంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం అంతర్వేది బీచ్ కి వెళ్ళిన ముగ్గురు యువకుల్లో ఓ యువకుడు జీప్ తో సహా గల్లంతయ్యాడు. కాకినాడ నుంచి వచ్చిన ముగ్గురు యువకులు అంతర్వేదిలో రూమ్ తీసుకున్నారు. న్యూ ఇయర్ వేళ రాత్రి పార్టీ సెలబ్రేట్ చేసుకున్నారు. అర్ధరాత్రి 11:30 గంటలకు రూమ్ లో ఒక యువకుడు ఉండగా.. మిగతా ఇద్దరు థార్ జీప్ లో…
2025 సంక్రాంతి పండుగకు నెల రోజులు ముందే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పందెం కోళ్లు సై అంటున్నాయి, పందెం రాయుళ్లు రెచ్చిపోతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా పందెం కోళ్ళు బరిలోకి దిగుతున్నాయి.. సై అంటే సై అంటూ కాళ్లు దువ్వుతున్నాయి. కోనసీమ ప్రాంతంలోని కొబ్బరి తోటల్లో జోరుగా కోడిపందాలను నిర్వహిస్తున్నారు. విచ్చలవిడిగా బరులు గీసి కోడిపందేలు జరుపుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి పందెం రాయుళ్లు పందెం కోళ్లు తీసుకుని కోనసీమ ప్రాంతానికి వస్తున్నారు. కొన్నిచోట్ల పెద్ద స్థాయిలోనే…
Deputy CM Pawan: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా కేశనపల్లిలో సముద్ర జలాలతో దెబ్బ తిన్న లక్షలాది కొబ్బరి చెట్లను పరిశీలించారు.
Bus Driver Saves 50 Students:ఏకంగా 50 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడి.. తనువు చాలించాడు ఓ స్కూల్ బస్సు డ్రైవర్.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట సెంటర్‌లో ఈ రోజు ఉదయం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. రాజమండ్రి గైట్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన బస్సు డ్రైవర్ దెందుకూరి నారాయణరాజు (60) తన కర్తవ్య నిర్వహణలో విద్యార్థుల ప్రాణాలను కాపాడి తాను మాత్రం ప్రాణాలు…
Ramachandrapuram Bandh: నేడు రామచంద్రాపురం బంద్‌కు పిలుపు ఇచ్చింది జేఏసీ.. రామచంద్రాపురం నియోజకవర్గాన్ని ప్రస్తుతం ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వద్దు.. మా ప్రాంతాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ జేఏసీ నేడు రామచంద్రాపురం బంద్‌కు పిలుపునిచ్చింది. తమ స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు రాజకీయ నాయకులు ప్రజల డిమాండ్‌ను పట్టించుకోకుండా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని జేఏసీ నాయకులు మండిపడుతున్నారు.. రామచంద్రాపురం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం నుండి…
Nara Lokesh: మొంథా తుఫానుపై ఆర్టీజీఎస్ కేంద్రంలో రెండో రోజు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు.. వివిధ జిల్లాల్లో మొంథా తుఫాను తీవ్రత, ఇప్పటివరకు జరిగిన నష్టంపై ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమీక్షించారు.. మొంథా తుఫాను వల్ల కలిగిన నష్టంపై ప్రాథమిక అంచనాలు త్వరితగతిన రూపొందించాలని అధికారులను ఆదేశించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణపై అధికారులను ఆరా తీశారు మంత్రి నారా లోకేష్..
ఏపీ తీర ప్రాంతాలను మొంథా తుపాను వణికిస్తోంది.. కాకినాడ, విశాఖ సముద్ర తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఈదురు గాలులు బలంగా వీస్తున్నాయి. మొంథా తీవ్ర తుఫాన్‌గా బలపడడంతో ఏపీలోని కొన్ని జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. తుఫాన్ ప్రభావంతో గరిష్టంగా 100-110 కిలో మీటర్లకు ఈదురుగాలుల వీస్తున్నాయి.. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు మరో 72 గంటల పాటు తుఫాన్ ముప్పు ఉంది. భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ…