మొంథా తుఫాన్ తీరం దాటిన అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది బీచ్ వద్ద సముద్రం అల్లకల్లోలంగా ఉంది. రెండు మీటర్ల ఎత్తులో కెరటాలు ఎగసిపడుతూ లైట్‌హౌస్‌ని తాకుతున్నాయి. రాజోలు ప్రాంతంలో ఉదయం నుంచి భారీ ఈదురు గాలులు వర్షం కొనసాగుతున్నాయి. నిన్నటి నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల రోడ్లపై పడిన చెట్లను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తొలగిస్తున్నారు. పల్లిపాలెం గ్రామం జలమయం కావడంతో మత్స్యకార కుటుంబాలు పునరావాస కేంద్రాల్లోనే గడుపుతున్నారు. జిల్లా…
అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేది బీచ్‌లో సముద్రం వెనక్కి వెళ్లి, ముందుకు రావడంతో కలకలం రేపుతుంది. సముద్రం సాధారణం కంటే 500 మీటర్లు లోపలికి వెళ్లడంతో స్థానికులలో భయాందోళనలు నెలకొన్నాయి. ఉదయం మార్నింగ్ వాక్‌కు వచ్చిన అంతర్వేది సర్పంచ్ కొండా జాన్ బాబు ఇది సునామీకి సంకేతం అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. సముద్రం వెనక్కి వెళ్లడంతో అంతర్వేది బీచ్‌లో పేరుకుపోయిన ఒండ్రు మట్టి బయటపడడంతో పర్యాటకులు భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. Also Read: Asia Cup…