సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం లో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే. ఆ సినిమా కి ఇటీవలే గుంటూరు కారం అనే టైటిల్ ను కూడా ఖరారు చేయడం జరిగిందిమాస్ తో పాటు అన్ని వర్గాల వారికి కూడా గుంటూరు కారం టైటిల్ బాగా నచ్చింది అంటూ యూనిట్ సభ్యులు ఎంతో నమ్మకంగా అయితే వున్నారు.. ఈ సినిమా షూటింగ్ కొన్ని కారణాల వల్ల వరుస గా వాయిదాలు పడుతూ వచ్చిందని తెలుస్తుంది.. ప్రస్తుతానికి గుంటూరు కారం సినిమా రెగ్యులర్ గా షూటింగ్ జరుగుతోంది. ఆ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకుండానే మాటల మాంత్రికుడు అయిన త్రివిక్రమ్ మరో సినిమా ను ఒప్పుకోవడం పట్ల కొంత మంది విమర్శలు చేస్తున్నారు.
అల్లు అర్జున్ మరియు త్రివిక్రమ్ కాంబోలో ఒక ప్రాజెక్ట్ ను ఆహా ఓటీటీ వారు అధికారికంగా అయితే ప్రకటించడం జరిగింది. దాంతో మహేష్ బాబు అభిమానులు స్పందిస్తూ అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ సినిమా లు చేసుకోవడంలో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఇప్పుడు గుంటూరు కారం సినిమా రూపొందుతూ ఉండగా ఎందుకు అల్లు అర్జున్ సినిమా ను మొదలు పెట్టాలి అని త్రివిక్రమ్ పై కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ మరియు త్రివిక్రమ్ కాంబోలో సినిమా ఎలా ఉంటుంది అసలు ఆ ఓటీటీ ప్రాజెక్ట్ గురించి సరైన విషయం తెలుసుకోకుండా చాలా మంది ఇష్టానుసారంగా త్రివిక్రమ్ గురించి కామెంట్స్ ను చేస్తున్నారు. తరువాత అయినా ఈ విషయం పై పూర్తి క్లారిటీ త్రివిక్రమ్ నుండి వస్తుందా.. త్రివిక్రమ్ పై మహేష్ బాబు అభిమానులు చేసే విమర్శలు ఆపుతారా అనేది అయితే చూడాలి. మహేష్ బాబు.. త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతున్న సినిమా ను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు సమాచారం.మరి అల్లు అర్జున్.. త్రివిక్రమ్ కాంబో ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుంది అనే విషయం పై క్లారిటీ రావాలి.