Medico Preethi Case: మెడికో ప్రీతి ఆత్మహత్య కేసులో.. కోర్టుకి చార్జ్‌షీట్ సమర్పించిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Police Filed Medico Preethi Suicide Case Chargesheet In Court: మెడికో ప్రీతి ఆత్మహత్య కేసులో పోలీసులు కోర్టుకి చార్జ్‌షీట్ సమర్పించారు. ఇందులో ప్రీతి మృతికి సైఫ్ వేధింపులే ప్రధాన కారణమని పేర్కొన్నారు. కులం పేరు ప్రస్తావించడంతో పాటు ర్యాగింగ్ చేయడంతో.. ప్రీతి డిప్రెషన్‌కు లోనై, ఆత్మహత్య చేసుకుందని చార్జ్‌షీట్‌లో పోలీసులు పేర్కొన్నారు. కళాశాలలో ప్రీతి చేరినప్పటి నుంచి.. సైఫ్ ఆమెను పలురకాలుగా హేళన చేసే విధంగా మాట్లాడి, మానసికంగా ఇబ్బందులు పెట్టేవాడని తెలిపారు. ఆ వేధింపులు భరించలేక.. ప్రీతి ఫిబ్రవరి 22వ తేదీన ఉదయం 08.10 గంటలకు ఆత్మహత్యాయత్నం చేసిందని చెప్పారు. ఈ కేసులో 70 మంది సాక్షులను విచారించి.. సైంటిఫిక్, టెక్నికల్, మెడికల్, ఫోరెన్సిక్ నిపుణల సహకారంతో మృతురాలు, నిందితుడు, వారి మిత్రులు వాడిన సెల్‌ఫోన్‌ల డేటాను వెలికి తీసి.. మృతురాలు మరణంపై కేసుకు సంబందించిన అన్ని రకాల సాక్ష్యధారాలు సేకరించి.. అన్ని పరిశీలించిన తర్వాత విచారణలో మెడికో ప్రీతిని డాక్టర్ ఎంఏ సైఫ్ ర్యాగ్గింగ్ పేరుతో వేధించి, ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించాడని రుజువు అయ్యిందని పోలీసులు స్పష్టం చేశారు. తాము సేకరించిన సాక్ష్యాధారాలతో కలిపి, 970 పేజీలతో కోర్టులో చార్జ్‌షీట్ ఫైల్ చేశారు.
Bandi Sanjay: ప్రధాని మోడీ రైతు పక్షపాతి.. పంటలకు కనీసం మద్దతు ధర పెంచడం హర్షణీయం
Also Read
కాగా.. ప్రీతి ఆత్మహత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తొలుత ఈమెది హత్యేనని అనుమానాలు వ్యక్తం అవ్వగా.. ఆ తర్వాత వచ్చిన పోస్టుమార్టం రిపోర్టులు, లభ్యమైన ఇతర సాక్ష్యాధారాల దృష్ట్యా.. ఆమెది ఆత్మహత్యేనని తేలింది. సైఫ్ పెట్టిన వేధింపుల వల్లే ఆమె మానసిక ఒత్తిడికి గురై, సూసైడ్ చేసుకున్నట్లు వెల్లడైంది. మరోవైపు.. వరంగల్ కేఎంసీలో ప్రీతి హాస్టల్ రూమ్‌ను కుటుంబ సభ్యులు ఓపెన్ చేశారు. ప్రీతి మృతిపై అనేక అనుమానాలు, ఆందోళనలు వక్తమైన నేపథ్యంలో.. పోలీసులు ఈ రూమ్‌ని సీజ్ చేసి, విచారణ చేపట్టారు. అయితే.. ఇప్పుడు కేఎంసీకి కొత్త విద్యార్థులు వస్తుండటంతో, ప్రీతి రూమ్ ఖాళీ చేయాలని కుటుంబ సభ్యులకు సూచించారు. దీంతో.. ప్రీతి తండ్రి నరేందర్, సోదరుడు పృథ్వీ పోలీసులను ఆశ్రయించి.. వారి సమక్షంలో ప్రీతి రూమ్ ఓపెన్ చేశారు. ప్రీతికి చెందిన స్టడీ మెటీరియల్స్‌తో పాటు మెడిసిన్, ఇతర సామాగ్రిని తీసుకెళ్ళారు. ప్రీతి మృతితో ప్రభుత్వం ఆమె కుటుంబానికి ఆర్థిక సహాయం అందించింది. ఆమె సోదరికి ఉద్యోగం కూడా కల్పించింది.
K Laxman: ఇచ్చిన హామీల్ని కేసీఆర్ తుంగలో తొక్కారు.. తెలంగాణని భ్రష్టు పట్టించారు
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..