ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఏపీ ప్రభుత్వం చర్చలు ముగిశాయి. ఉద్యోగ సంఘాలతో ఏపీ కేబినెట్ సబ్‌కమిటీ సమావేశమై.. ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లపై చర్చించింది. పీఆర్సీ, పెండింగ్ డీఏలు, పెన్షన్ బకాయిలు, ఇతర డిమాండ్లపై చర్చించింది. నాలుగు అంశాలపై స్పష్టమైన హామీ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కోరాయి.
ఇవాళ ఉదయం 10.30 గంటలకు సచివాలయంలోని బ్లాక్- 2 వద్ద మంత్రుల కమిటీతో ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై చర్చలు జరుపనున్నారు. కాగా, పెండింగ్ డీఏలతో పాటు బకాయి పడిన సరెండర్ లీవ్లు, పెన్షన్ బకాయిలు, సీపీఎస్ ఉద్యోగులకు చెందిన కాంట్రిబ్యూషన్ అన్నీ కలిపి 20 వేల కోట్ల రూపాయల మేర ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని ఉద్యోగ సంఘాలు తెలిపాయి.
ఉద్యోగ సంఘాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాకిచ్చింది.. సాధారణ బదిలీల్లో మినహాయింపు కోరుతూ ఉద్యోగ సంఘాలు జారీ చేసే ఆఫీస్ బేరర్ల లేఖల నిలుపుదలకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.
ఏపీలో పీఆర్సీ అంశం ఉద్యోగుల మధ్య చిచ్చుపెట్టింది. డిమాండ్లు పరిష్కారం కాకుండానే ఉద్యమాన్ని ముగించడం పట్ల కొన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగుల జేఏసీలో చీలిక వచ్చింది. ప్రభుత్వ ప్రతిపాదనలకు జేఏసీ స్టీరింగ్ కమిటీ అంగీకరించడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. మంత్రుల కమిటీతో పీఆర్సీ సాధన సమితి ఏం చర్చించిందో అర్థం కావడం లేదని.. అశుతోష్ మిశ్రా రిపోర్టు చూపించలేదని, నూతన పీఆర్సీ జీవోలు రద్దు చేయలేదని ఏపీటీఎఫ్ నేతలు ఆరోపిస్తున్నారు. Read…
ఏపీలో ఉద్యోగ సంఘాల నేతలు సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. మంత్రుల కమిటీతో చర్చలు సఫలం కావడంతో ఉద్యోగులు సమ్మెను విరమించారు. అంతకుముందు ఉద్యోగ సంఘాల నేతలు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఉద్యోగులతో సీఎం జగన్ మనసు విప్పి మాట్లాడారు. పీఆర్సీ విషయంలో ఉద్యోగులు ఎవరూ భావోద్వేగాలకు పోవద్దని సీఎం జగన్ కోరారు. తాను మనస్ఫూర్తిగా నమ్మేది ఒకటేనని.. ఉద్యోగులు లేకపోతే తాను లేనని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వానికి…
ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్ భేటీ అయ్యారు. ఈ ప్రభుత్వం మీది. మీ సహకారంతో మంచి చేయగలుగుతున్నాను. ఆర్థిక పరిస్థితుల వల్ల, కరోనా ప్రభావం వల్ల మీరు ఆశించినంత రీతిలో ఇవ్వలేకపోవచ్చు. కానీ ఎంతమేర మేలు చేయగలుగుతామో అన్ని రకాలుగా చేశాం అన్నారు జగన్. రాజకీయాలు ఇందులోకి వస్తే.. వాతావరణం దెబ్బతింటుంది. రాజకీయాలకు తావు ఉండకూడదు. ఏదైనా సమస్య ఉంటే.. అనామలీస్ కమిటీ కూడా ఉంది. ఎప్పుడైనా మీరు మీ సమస్యలను చెప్పుకోవచ్చు. ఉద్యోగ సమస్యలపై మంత్రుల…
ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు, ఉద్యోగుల జీతాలకు భారీగా ఖర్చుపెడుతుంది. దేశంలో ఆరు ప్రధాన రాష్ట్రాల కు సమానంగా ఉద్యోగుల జీతాలకు ఖర్చు చేస్తోంది. 2020-21లో ఉద్యోగుల కోసం ఏపీ 37,458 కోట్లు ఖర్చు చేసింది. గత ఏడాది 33,102 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టింది. ప్రభుత్వ ఆదాయంలో 36 శాతం ఉద్యోగుల కోసమే ఖర్చుపెడుతోందని ఓ నివేదికలో తేలింది.ప్రభుత్వ మొత్తం ఖర్చులో జీతాలు, పెన్షన్ల వాటా ఏపీలోనే అత్యధికమని చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ ఇచ్చిన నివేదిక…
ఏపీలో ఎట్టకేలకు పీఆర్సీ చర్చలు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. నిన్నటి నుంచి రెండు దఫాలుగా మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాలు విస్తృతంగా చర్చలు జరిపాయి. నిన్న, ఈరోజు రెండు రోజుల పాటు సుమారు 10 గంటల పాటు స్టీరింగ్ కమిటీ సభ్యుల సమావేశం సాగింది. ఉద్యోగ సంఘాల ప్రధాన అంశాలు హెచ్‌ఆర్ఏ, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్, రికవరీ రద్దు, ఐదేళ్ల పీఆర్సీపై ప్రభుత్వం సానుకూలంగా చర్చించినట్లు తెలుస్తోంది. Read Also: ఫిట్‌మెంట్‌పై కీలక ప్రకటన చేసిన…
ఏపీలో ఎస్మా ప్రయోగంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఓ వైపు మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాలు చర్చలు కొనసాగుతున్న తరుణంలో ఏపీ మైనింగ్ శాఖ ఎస్మా ఉత్తర్వులు ఇవ్వడం తీవ్ర విమర్శలకు దారితీసింది. చర్చల ప్రక్రియ మళ్లీ ప్రారంభమైందని అందరూ భావిస్తున్న తరుణంలో మైనింగ్ శాఖ ఎస్మా నిర్ణయం ఆశ్చర్యానికి గురిచేసింది. చర్చలు జరుగుతున్న సమయంలో ఎస్మా ఉత్తర్వులు ఇవ్వడం సరికాదని ఉద్యోగ సంఘాల నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. Read Also: బాలయ్యకు వైసీపీ…