టీమిండియా యువ ఓపెనర్ శుభ్మాన్ గిల్ తన జెర్సీ నంబర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తన జెర్సీపై జెర్సీ నంబర్ 77ని ఎలా పొందాడనే దానిపై ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టాడు. ఇటీవల స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. జెర్సీ నంబర్ 77ని పొందడం, దానితో ఎలా ఆడుతున్నాడనే దాని గురించి వెల్లడించాడు.