Punjab : పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఓ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. గర్భిణి అయిన భార్యను మంచానికి కట్టేసి సజీవ దహనం చేశాడో దుర్మార్గుడు. షాకింగ్ ఘటన ఆ ప్రాంతంలో కలకలం సృష్టించింది. ఈ దారుణానికి ఒడిగట్టిన భర్త, బాధితురాలి వయసులు కేవలం 23ఏళ్లే. ప్రస్తుతం ఆ అమాయకురాలు ఆరు నెలల గర్భిణి. ఆమె కడుపులో కవలలు ఉన్నారు. భర్త తన భార్యకు నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రస్తుతం పోలీసుల సోదాల అనంతరం నిందితుడిని అరెస్టు చేశారు.
Read Also:MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ
ఏదో విషయంలో భార్యాభర్తల మధ్య చాలా గొడవలు జరిగాయి. ఆ తర్వాత గొడవ బాగా పెరిగి కోపంతో భర్త సుఖ్‌దేవ్ మొదట తన భార్య పింకీని తిట్టాడు. ఆ తర్వాత మంచానికి కట్టేసి నిప్పంటించారు. ఈ ఘటనపై సమాచారం అందడంతో పరిసర ప్రాంతాల్లో కలకలం రేగింది. మహిళ సజీవ దహన వార్త విని అందరూ ఉలిక్కిపడ్డారు. భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో తొలుత భార్యను బలవంతంగా మంచానికి కట్టేశాడు. భార్య కూడా తనను విడిపించుకోవడానికి చాలా ప్రయత్నించింది. కానీ ఆమె ప్రయత్నాలు ఫలించలేదు. భార్య ఆరు నెలల గర్భిణి అనే విషయాన్ని కూడా మర్చిపోయాడు ఆ భార్త. భార్యను మంచంపై కట్టివేసి నిప్పంటించాడు. ఏడగుల సంబంధాన్ని కూడా పరిగణనలోకి తీసుకోకుండా క్రూరత్వం పీక్ స్టేజ్ కే చేరుకున్నాడు. మంటల దాటికి భార్య అరుస్తూనే ఉంది. కానీ ఆమె భర్తకు చిన్న కనికరం కూడా కలుగలేదు. తనకేమీ వినబడనట్లు భార్యను కాల్చివేసి పారిపోయాడు.
Read Also:Iraq- US Conflict: సిరియాలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాక్ దాడి..