పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం మరింత తీవ్రమయ్యే పరిస్థితి నెలకొంది. ఇరాక్‌లోని ఓ ఇరాన్ అనుకూల సైనిక స్థావరంపై జరిగిన దాడులు మరిచిపోక ముందే ఇరాక్.. సిరియాలోని అగ్రరాజ్యం అమెరికా స్థావరాలపైకి ఐదు రాకెట్లు ప్రయోగించినట్లు ఇద్దరు భద్రతా అధికారులు తెలిపారు. ఈశాన్య సిరియాలోని అమెరికా మిలిటరీ బేస్‌పై ఆదివారం నాడు ఇరాక్ ఈ రాకెట్లను ప్రయోగించిందని పేర్కొన్నారు.
Read Also: Vontimitta Kodanda Rama Kalyanam: నేడు పున్నమి వెలుగుల్లో కోదండరాముడి కళ్యాణం.. సిద్ధమైన ఒంటిమిట్ట
కాగా, ఇరాక్‌లోని జుమ్మర్ నగరం నుంచి సిరియాలోని అమెరికా మిలిటరీ బేస్‌పై రాకెట్ల ప్రయోగం చేసినట్లు అంతర్జాతీయు మీడియా సైతం తెలిపింది. ఇరాన్‌కు మద్దతు ఇచ్చే గ్రూప్‌లు.. యూఎస్ దళాలపై ఫిబ్రవరిలో దాడులు ఆపేసిన తర్వాత మళ్లీ మొదటిసారి అమెరికా సైనిక స్థావరాలపై దాడులకు ప్రత్నించినట్లు సమాచారం. మరోవైపు.. ఇరాక్ ప్రధాని మహమ్మద్ షియా అల్ సుదాని అమెరికా పర్యటన ముగిసిన తర్వాత రోజే ఈ దాడులు జరపటం గమనార్హం. జుమ్మర్ నగరంలో ఓ ట్రక్కులో రాకెట్ లాంచర్ అమర్చి ఉందని భద్రత వర్గాలు చెప్పుకొచ్చాయి. మేము ఈ ఘటనపై పరిశీలన చేస్తే.. తప్ప ట్రక్కుపై యుద్ధ విమానాలు బాంబు దాడి చేశాయని నిర్థారించలేమన్నారు.