India-Pakistan War: పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణను ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్‌లోని సాంబా సెక్టార్, పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లాలో పాక్ కి చెందిన డ్రోన్లు దూసుకు రావడంతో భారత రక్షణ వ్యవస్థ కుప్పకూల్చింది. వరుస ఘటనలతో జమ్మూ, రాజస్థాన్, పంజాబ్‌లోని పలు జిల్లాల్లో అధికారులు బ్లాక్ అవుట్ ప్రకటించారు.
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తత.. చైనా విదేశాంగ మంత్రి కీలక ప్రకటన.. భారతదేశం, పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతకు సంబంధించి చైనా ప్రకటన వెలువడింది. పాకిస్థాన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవడంలో తాము అండగా నిలుస్తామని చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యీ అన్నారు. ఈ మేరక తాజాగా పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్‌తో చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యీ ఫోన్ చేశారు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణలో చైనా మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం…
Missile Attack : ఉగ్ర స్థావరాలపై భారత్ సర్జికల్ స్ట్రైక్స్‌తో ఉలిక్కిపడిన పాకిస్తాన్, సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు తెగబడుతోంది. గురువారం తెల్లవారుజామున సుమారు 1 గంట ప్రాంతంలో పంజాబ్‌లోని అమృతసర్ సరిహద్దు జిల్లాలో భీకర శబ్దాలు, ఆకాశంలో వెలుగులు కనిపించడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అనంతరం విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఉదయం జెతువాల్, మఖన్ విండి, పాంధేర్ శివారు ప్రాంతాల్లో క్షిపణి శకలాలు లభ్యమయ్యాయి. Miss World 2025 :…
లోయలో పడిన ఆర్మీ వాహనం.. ముగ్గురు సైనికులు మృతి జమ్మూ కాశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారత ఆర్మీ వాహనం లోయలో పడిపోయింది. 700 అడుగుల లోతైన లోయలో ఆర్మీ కాన్వాయ్ లోని వాహనం పడింది. జమ్ము నుంచి శ్రీనగర్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు సైనికులు మృతిచెందారు. మరణించిన సైనికులను అమిత్ కుమార్, సుజీత్ కుమార్, మాన్ బహదూర్ గా గుర్తించినట్లు వార్తా సంస్థ పిటిఐ తెలిపింది. 700…
Punjab: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే, ఉద్రిక్తతల నడుమ పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఇద్దరు పాకిస్తాన్ గూఢచారులు దొరికారు. ఆర్మీ కంటోన్మెంట్, వైమానిక స్థావరాల సున్నితమైన సమాచారం, ఫోటోలను లీక్ చేయడంలో వీరి పాత్రకు సంబంధించి పంజాబ్ పోలీసులు ఇద్దర్ని అరెస్ట్ చేసినట్లు ఆదివారం తెలిపారు.
అమృత్‌సర్‌లో ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేశాయి బిఎస్‌ఎఫ్ దళాలు. పహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత భద్రతా బలగాలు డేగ కన్నుతో పర్యవేక్షిస్తున్నాయి. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాయి. ఈ క్రమంలో అమృత్‌సర్ జిల్లాలోని భరోపాల్ గ్రామం సమీపంలో పంజాబ్ పోలీసులతో కలిసి బిఎస్‌ఎఫ్ దళాలు భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రి, గ్రెనేడ్‌లను స్వాధీనం చేసుకున్నాయి. నిన్న సాయంత్రం నిర్వహించిన సంయుక్త సెర్చ్ ఆపరేషన్‌లో 2 గ్రెనేడ్‌లు, 3 పిస్టళ్లు, 6 మ్యాగజైన్‌లు, 50 లైవ్ కార్ట్రిడ్జ్‌లు…
Minister Lokesh: పంజాబ్‌లోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం అమృత్‌సర్ స్వర్ణ దేవాలయాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కుటుంబ సమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ అందరి సుఖశాంతి, ఆయురారోగ్యాల కోసం ప్రార్థించానని.. స్వర్ణ దేవాలయ సందర్శన మహా భాగ్యంగా భావిస్తున్నానని అన్నారు. ఈ రోజు ఉదయం అమృత్‌సర్‌కు చేరుకున్న లోకేష్ కుటుంబం, అత్యంత పవిత్రమైన శ్రీ హర్మందిర్ సాహిబ్‌ను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. స్వర్ణ దేవాలయం ఆవరణలో గడిపిన సమయం…
America : దేశంలో అక్రమంగా నివసిస్తున్న 119 మంది భారతీయులను తీసుకుని అమెరికా సైనిక విమానం ఈ రాత్రి అమృత్‌సర్ చేరుకుంటుంది. శుక్రవారం ఈ సమాచారం వర్గాలు తెలిపాయి.
అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను విమానాల్లో పంపించేస్తోంది. ఇప్పటికే ఒక విమాన అహ్మదాబాద్‌కు చేరుకుంది. ఇంత వరకు బాగానే ఉంది. మరికొన్ని గంటల్లో వచ్చే రెండు విమానాలపై రచ్చ రచ్చ సాగుతోంది.