గేమ్ ఛేంజర్ రిజల్ట్ తో డీలా పడిన మెగా ఫ్యాన్స్ కు సరైన బ్లాక్ బస్టర్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు రామ్ చరణ్. బుచ్చిబాబు డైరెక్షన్ లో చేస్తున్న RC 16ని భారీగా ప్లాన్ చేస్తున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. కుస్తి, కబడ్డీ, క్రికెట్‌తో పాటు ఇంకా చాలా ఆటలు ఈ సినిమాలో ఉంటాయని, చరణ్ ఆటకూలీగా కనిపిస్తాడని రోజు రోజుకి అంచనాలు పెంచుతునే ఉన్నారు. ఇదే సమయంలో మార్చ్ 27 న రామ్ చరణ్ బర్త్ డే గిఫ్ట్‌గా RC16 నుంచి అదిరిపోయే ట్రీట్ ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వైరల్ అయ్యాయి.
Also Read : Court : మూడవ వారంలోకి కోర్ట్.. స్టడీగా కలెక్షన్స్
బుచ్చి బాబు, రామ్ చరణ్ ఫ్యాన్స్ కోసం RC 16 టైటిల్‌తో పాటు ఒక స్పెషల్ గ్లింప్స్ రెడీ చేస్తున్నారని, అందుకోసం సపరేట్‌గా ఓ ఫోటో షూట్ కూడా నిర్వహిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కానీ RC 16 గ్లిమ్స్ అయితే కట్ చేసారు కాని ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇంక ఇవ్వలేదు. ఈ రోజునుండి వర్క్ స్టార్ట్ చేసిన చరణ్ బర్త్ డే నాటికి వర్క్ ఫినిష్ అవ్వకపోవచ్చు అని తెలుస్తోంది. కానీ చరణ్ మెగా ఫ్యాన్స్‌ను డిసప్పాయింట్ చేసే ఛాన్స్ లేదని కొందరు అంటున్నారు. గ్లింప్స్ రిలీజ్ చేయకపోయినా ఆర్సీ 16 టైటిల్ రివీల్ చేసే ఛాన్స్ లేకపోలేదని అంటున్నారు. ఇప్పటికే పెద్ది అనే టైటిల్ లాక్ చేశారని టాక్. అయితే ఈ విషయాల్లో క్లారిటీ రావాలంటే.. మరో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మరి మార్చ్ 27న ఆర్సీ 16 ట్రీట్ ఉంటుందో లేదో చూడాలి.