ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంపై స్పందించారు. తన పేరు ప్రస్తుతం చర్చకు వస్తుండటంపై ఆయన వివరణ ఇచ్చారు. ఎక్స్ (మాజీ ట్విట్టర్) వేదికగా వీడియోను విడుదల చేసిన ఆయన, గతంలో తాను ఓ గేమింగ్ యాప్ యాడ్ చేసిన విషయాన్ని అంగీకరించారు. అయితే, ఆ ప్రకటనను చేయడం తప్పుడు నిర్ణయమని తెలుసుకుని, తానే స్వయంగా ఒప్పందాన్ని పొడిగించకుండా నిష్క్రమించానని స్పష్టం చేశారు.