Vizag: విశాఖపట్నం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించిన వ్యక్తి మరొకరిని వివాహం చేసుకున్నాడని కోపంతో రగిలిపోయిన యువతి.. ఆ కోపంతో అపార్ట్మెంట్ సెల్లార్లో పార్కింగ్ చేసిన 14 వాహనాలను దగ్ధం చేసింది. ఈఘటన విశాఖలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అయితే, మూడేళ్ల నుంచి ఓ యువకుడిని ప్రేమిస్తున్న యువతి.. రెండేళ్ల క్రితం మరో ఆమెను పెళ్లి చేసుకున్న ప్రియుడు.. కోపంతో అతడి బైక్ కు నిప్పంటించిన యువతి.. ఆ బైకును ఆనుకొని ఉన్న మిగతా బైకులు సైతం పూర్తిగా దగ్ధం అయ్యాయి.
Read Also: Nagarkurnool: దారుణం.. దైవ దర్శనానికి వచ్చిన యువతిపై 8 మంది సామూహిక అత్యాచారం..
ఇక, అపార్ట్మెంట్ వాసులు ముందుగా ఆకతాయిల పనిగా భావించినప్పటికీ. సీసీటీవీ విజువల్స్ పరిశీలించగా యువతి ఈ 14 వాహనాలను దగ్దం చేసినట్లు తేలింది. దీంతో అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. రంగంలోని దిగిన పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, అసలు విషయం చెప్పడంతో నిందితురాలని రిమాండ్ కు తరలించారు పోలీసులు.