థామ్సన్ భారతదేశంలో తన కొత్త QLED Linux (కూలిటా 3.0) OS శ్రేణి టీవీలు, ఎయిర్ కూలర్లను విడుదల చేసింది. ఈ టీవీ లైనప్‌లో 24-అంగుళాల స్మార్ట్ టీవీ కూడా ఉంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి 24-అంగుళాల QLED (Linux) స్మార్ట్ టీవీ. ఈ టీవీలు ఆకట్టుకునే డిజైన్, VA డిస్ప్లే ప్యానెల్, 36W వరకు సౌండ్ అవుట్‌పుట్‌తో వస్తాయని కంపెనీ తెలిపింది. ఇవి ప్రముఖ OTT యాప్‌లు, అనేక కనెక్టివిటీ పోర్ట్‌లకు సపోర్ట్ చేస్తాయి.
Also Read:LSG vs PBKS: లక్నో నడ్డి విరిచిన పంజాబ్ బౌలర్స్.. టార్గెట్ ఎంతంటే?
భారతదేశంలో థామ్సన్ QLED టీవీ ధర
భారత్ లో థామ్సన్ QLED టీవీ ధర రూ. 6,799 నుంచి ప్రారంభమవుతుంది.
టీవీ మోడళ్ల ధరలు
24-అంగుళాలు – రూ. 6,799
32-అంగుళాలు- రూ. 8,999
40-అంగుళాలు – రూ. 12,999
థామ్సన్ QLED టీవీ స్పెసిఫికేషన్లు
థామ్సన్ కొత్త QLED టీవీ శ్రేణి 24-, 32-, 40-అంగుళాల స్క్రీన్ సైజులలో అందుబాటులో ఉంటుంది. ఇవి VA ప్యానెల్‌లతో వస్తాయి. 1.1 బిలియన్ కలర్స్ కు సపోర్ట్ చేస్తాయి. ఈ టీవీలు Linux Coolita 3.0 OS పై పనిచేస్తాయి. ముందే ఇన్‌స్టాల్ చేయబడిన గేమ్‌లతో వస్తాయి. వీటిలో JioHotstar, YouTube, Prime Video, Sony Liv, Zee5 వంటి ప్రముఖ OTT యాప్‌లకు సపోర్ట్ చేస్తుంది.
Also Read:HCA-SRH : హెచ్‌సీఏ-ఎస్ఆర్‌హెచ్ వివాదానికి శుభం కార్డు.. దిగొచ్చిన HCA
ఈ టీవీ లైవ్ ఛానెల్స్, నెట్‌వర్క్-ఫ్రీ స్క్రీన్ మిర్రరింగ్, వాయిస్ సెర్చ్ సపోర్ట్, మిరాకాస్ట్‌తో Wi-Fi తో వస్తుంది. 24-అంగుళాల మోడల్ 24W సౌండ్ అవుట్‌పుట్‌ను కలిగి ఉండగా, 32-అంగుళాల, 40-అంగుళాల మోడల్‌లు 36W అవుట్‌పుట్‌ను అందిస్తున్నాయి. ఇవి సరౌండ్ సౌండ్‌తో బాటమ్-ఫైరింగ్ స్పీకర్‌లను కలిగి ఉంటాయి. పోర్టులలో కోక్సియల్, HDMI, USB పోర్ట్‌లు ఉన్నాయి. థామ్సన్ QLED టీవీలు A35*4 ప్రాసెసర్‌తో వస్తున్నాయి.
Also Read:Zomato: ఉద్యోగం లోకి తీసుకున్న ఏడాదికే.. 600 మందిని తొలగించిన జొమాటో.!
JioTele OS తో మొదటి స్మార్ట్ టీవీ
థామ్సన్ ఇటీవల భారత్ లో కొత్త 43-అంగుళాల QLED టీవీని విడుదల చేసింది. ఇందులో తాజా JioTele OS ఉంది. జియో కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తున్న తొలి స్మార్ట్ టీవీ ఇది. దీని ధరను రూ.20,000 కంటే తక్కువకే వచ్చేస్తోంది. QLED స్క్రీన్‌తో కూడిన ఈ టీవీ బోలెడు ఫీచర్లు, పాపులర్ OTT యాప్‌లను కూడా కలిగి ఉంది.