Crime: ప్రస్తుతం ఎంత ప్రయత్నించిన పెళ్లి కావట్లేదని కొందరు బాధపడుతుంటే పెళ్లి చేసుకుని విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారు మరికొందరు. పెళ్లితో ఒకటై జీవితాంతం కలిసి బ్రతకాల్సిన దంపతులు ఒకరిని ఒకరు కడతేర్చుకోవడం చాల బాధాకరం. భార్యని చంపిన భర్త అని భర్తను చంపిన భార్య అనే వార్తలు కోకొల్లలు. అలాంటి ఘటనే తాజాగా ఏలూరులో చోటు చేసుకుంది. ఓ భర్త తన భార్యని హత్య చేసేందుకు ప్రయత్నించాడు. అదృష్ట వశాత్తు ఆమెకి ఏమి కాలేదు.
Read also: Pregnant woman: డోలిలో గర్భిణీ.. వైద్యం కోసం నలభై కిలోమీటర్లు ప్రయాణం
వివరాలలోకి వెళ్తే.. ఏలూరు శివారులోని వట్లూరు రైల్వే ట్రాక్ పై ఓ వ్యక్తి తన భార్య పైన బ్లేడ్ తో దాడికి దిగాడు. ఈ సమాచారం కానిస్టేబుల్ కి అందింది. వెంటనే కానిస్టేబుల్ ఘటన స్థలానికి చేరుకున్నారు. కానిస్టేబుల్ ఎంత నచ్చ చెప్పాలని ప్రయత్నించిన అతను వినలేదు. ఓ వైపు ట్రైన్ వస్తుంది మరో వైపు ఆ వ్యక్తి చేతిలో బ్లేడ్ ఉంది. ఈ నేపథ్యంలో కానిస్టేబుల్ సమయస్ఫూర్తితో వ్యవహరించారు. చాకచక్యంగా దాడి చేస్తున్న వ్యక్తి చేతుల్లో నుండి ఆ మహిళను కాపాడాడు. ప్రాణాలకి తెగించి ఆ దంపతులని ట్రాక్ పైన నుండి పక్కి తీసుకువచ్చి రెండు ప్రాణాలను నిలిపాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. వీడియో చూసిన నెటిజెన్స్ ప్రాణాలకి తెగించి వృత్తికి న్యాయం చేసిన కానిస్టేబుల్ పైన ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అలానే కానిస్టేబుల్ ధైర్య సాహసాలను మెచ్చుకుంటున్నారు.