Biparjoy Effect: బిపర్జాయ్ తుఫాన్ దెబ్బకు 67 రైళ్లు రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిపర్జాయ్ తుఫాను బీభత్సం సృష్టిస్తుంది. ప్రస్తుతం గుజరాత్ లోని పోర్ బందర్‌కు నైరుతి దిశగా 310 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. జూన్ 15 నాటికి గుజరాత్ తీర ప్రాంతాలైన సౌరాష్ట్ర, కచ్ వద్ద తీరం దాటే అవకాశం ఉంది. దీంతో ముందుజాగ్రత్త చర్యగా పశ్చిమ రైల్వే నేడు (మంగళవారం) 67 ఎక్స్‌ప్రెస్ రైళ్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు పేర్కొనింది. రద్దైన రైళ్లలో ముంబైకి చెందినవి 5 ఉన్నాయి. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పలు భద్రత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రద్దైన ట్రైన్లకు సంబంధించిన టికెట్ల రిఫండ్ త్వరలో ప్రయాణికుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు పశ్చిమ రైల్వే వెల్లడించింది.
Also Read : Avinash Reddy: సుప్రీం కోర్టులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్.. విచారణ వాయిదా
Also Read
- POK killings: పీఓకేలో పాక్ హత్యాకాండ.. 30 మంది బ్రిటిష్ ఎంపీల ఆందోళన..
- India: చరిత్రలో తొలిసారి, 12 అణు వార్హెడ్లను మోహరించిన భారత్..
- POK: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో తిరుగుబాటు.. ఆర్మీ కాల్పుల్లో 30 మంది బలి..
- PM Modi 12 Years Governance: డిజిటల్ విప్లవం నుంచి గ్లోబల్ ప్రభావం వరకు.. మోడీ 12 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంసలు..
భవ్నగర్ డివిజన్లో 5, రాజ్‌కోట్‌లోని 8, అహ్మదాబాద్ డివిజన్లోని 3 ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు డబ్ల్యూఆర్‌లోని చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ తెలిపారు. 50 కిలో మీటర్ల కంటే అధికంగా గాలులు వీస్తే వెంటనే రైళ్లను నిలిపివేయాలని స్టేషన్ మాస్టర్లకు రైల్వే అధికారులు సూచించారు. ట్రాక్, వంతెనలపై ఎప్పటికప్పుడు పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. రైలు కార్యకలాపాలకు ఏదైనా ఆటంకం కలిగితే తక్షణ చర్యలు తీసుకోవాలని కంట్రోల్ రూమ్‌కి సూచించాలని పేర్కొన్నారు. వైర్లెస్ కమ్యూనికేషన్, 15 వీహెచ్ఎఫ్ సెట్లు, శాటిలైట్ ఫోన్లు తదితర సౌకర్యాలతో కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్నారు.
Also Read : Rakesh Tikait: రైతు ఉద్యమంపై ఫేస్బుక్, ట్విట్టర్లో తగిన ప్రచారం జరగలేదు
రాబోయే తుఫాన్ ముప్పును విజయవంతంగా ఎదుర్కొనేందుకు పశ్చిమ రైల్వే అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో కచ్ జిల్లాలోని తీర ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఈ నెల 15 వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని ఇప్పటికే తీరప్రాంతాల్లో వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు సముద్రంలో ఉన్న మత్స్యకారులు తీరానికి తిరిగి రావాలని సూచించారు. గాలుల తీవ్రతతో కొన్ని విమానాలను సైతం రద్దు చేయగా.. చాలా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
తాజావార్తలు
-
POK killings: పీఓకేలో పాక్ హత్యాకాండ.. 30 మంది బ్రిటిష్ ఎంపీల ఆందోళన..
-
Ponguleti Srinivas Reddy : గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో చేసిందేమీ లేదు
-
Tech News: మనల్ని మింగేసే రాక్షసి..! బాంబు పేల్చిన ‘క్లాడ్’
-
Abhai Naveen : కథ పట్టుకెళ్తే గ్లామర్ కావాలంటారు.. హీరోయిన్ల గుట్టు విప్పిన బిగ్ బాస్ అభయ్ నవీన్!
-
Shocking Survey: మన దేశంలో ఒంటరి మహిళలు ఎక్కడ ఎక్కువో తెలుసా? జాతీయ సగటు కంటే సౌత్‌లోనే ఘోరం!
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!