POK: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో తిరుగుబాటు.. ఆర్మీ కాల్పుల్లో 30 మంది బలి..
- పాక్ ఆక్రమిత కాశ్మీర్లో భారీ స్థాయిలో నిరసనలు.
- ఆందోళనలను అణచివేసేందుకు పాక్ ఆర్మీ కాల్పులు
- . ఘర్షణల్లో 30 మందికి పైగా మృతి, 200 మందికి పైగా గాయాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
POK: పాకిస్తాన్ ఆక్రమిక కాశ్మీర్(POK) అట్టుడుకుతోంది. పాకిస్తాన్ ప్రభుత్వం అణిచివేతకు నిరసనగా పీఓకే ప్రజలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తమ హక్కుల కోసం నినాదాలు చేశారు. పీఓకే పాకిస్తాన్ నుంచి విముక్తి కావడానికి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. తమ స్వాతంత్య్రం కోసం ఆందోళనబాట పట్టారు. అయితే, ఈ ఆందోళనల్ని పాక్ ఆర్మీ, పాక్ ప్రభుత్వం అత్యంత క్రూరంగా అణిచివేస్తోంది. ఈ మొత్తం వ్యవహారానికి రిజర్వేషన్ వివాదం కారణమైంది.
పాకిస్తాన్ ఆర్మీ అందోళనల్ని అణిచివేయడానికి కాల్పులు జరిపింది. నిరసనకారులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఘర్షణల్లో 30 మందికి పైగా మరణించారు. సుమారు 200 మంది గాయపడ్డారు. ఈ నిరసనలకు నేతృత్వం వహిస్తున్న ‘జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ’ (JAAC)పై అధికారులు నిషేధం విధించిన తర్వాత పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. శాంతిభద్రతలు, భద్రతా కారణాలను సాకుగా చూపుతూ అధికారులు శుక్రవారం నాడు జేఏఏసీని నిషేధించింది. శుక్రవారం రాత్రి భద్రతా సిబ్బందితో జరిగిన ఘర్షణలో ఒక వ్యాపారి మరణించడంతో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ముఖ్యంగా రావల్కోట్ ప్రాంతంతో ఘర్షణలు చెలరేగాయి.
Also Read
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
- Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
పోలీస్ కాల్పుల్లో మరణించిన ఒక వ్యక్తి మృతదేహాన్ని ఆదివారం నాడు ఆస్పత్రి మార్చురీకి తరలించగా జేఏఏసీ నిరసనకారులు అక్కడ గుమిగూడారు. అయితే, నిరసనకారులు తమపై ఆటోమెటిక్ రైఫిళ్లు, పెట్రోల్ బాంబులతో దాడులు చేశారని పోలీసులు ఆరోపించారు. జూలై 27న జరగనున్న ప్రాంతీయ శాసనసభ ఎన్నికల్లో మొత్తం 45 స్థానాలకు గానూ శరణార్థులకు 12 స్థానాలు కేటాయించడంపై ప్రజలు నిరసనలు ప్రారంభించారు.
తాజావార్తలు
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..