Shocking Survey: మన దేశంలో ఒంటరి మహిళలు ఎక్కడ ఎక్కువో తెలుసా? జాతీయ సగటు కంటే సౌత్‌లోనే ఘోరం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking Survey: మన దేశంలో వివాహ వ్యవస్థ.. కుటుంబ బంధాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. వివాహ బంధాలు విచ్ఛిన్నమయ్యే పరిస్థితులు చాలా అరుదుగా వస్తాయని మన అందరం అనుకుంటాం. అయితే తాజా గణాంకాలు మాత్రం ఈ విషయంలో ఆశ్చర్యకరమైన విషయాలను వెలుగులోకి తెచ్చాయి. దేశవ్యాప్తంగా భాగస్వామి లేని మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. విడాకులు తీసుకున్నవారు.. భర్త చనిపోయినవారు.. ఒంటరిగా ఉంటున్న మహిళల శాతం జాతీయ సగటు కంటే సౌత్‌లోనే ఎక్కువగా ఉందట… ఈ పరిస్థితికి కారణం ఏంటి…???
దేశంలో భాగస్వామి లేకుండా ఒంటరిగా జీవిస్తున్న మహిళల సంఖ్యపై శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. జాతీయ స్థాయిలో ఈ సంఖ్య కాస్త తగ్గినా దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం ఈ శాతం ఆందోళనకరంగా ఉంది. విడాకులు తీసుకున్నవారు, భర్త చనిపోయినవారు, భర్తకు దూరంగా ఉంటున్న వారి సంఖ్య ఐదు దక్షిణ భారత రాష్ట్రాల్లోనే అత్యధికంగా ఉంది. జాతీయ స్థాయిలో భాగస్వామి లేని మహిళల సగటు 5.4 శాతంగా ఉంటే పురుషుల శాతం కేవలం 1.6 శాతంగా నమోదైంది.
Also Read
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
- Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
రాష్ట్రాల వారీగా గణాంకాలను పరిశీలిస్తే.. తమిళనాడు ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. తమిళనాడులో అత్యధికంగా 11.6 శాతం మంది మహిళలు ఒంటరిగా జీవిస్తున్నారు. కేరళ 10.4 శాతంతో రెండో స్థానంలో ఉండగా.. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు 8.6 శాతంతో ఉన్నాయి. తెలంగాణలో ఈ సంఖ్య 7.6 శాతంగా రికార్డ్ అయింది. ఇక దేశంలో అత్యల్పంగా బీహార్‌లో కేవలం 2 శాతం మంది మహిళలు మాత్రమే భాగస్వామి లేకుండా ఉన్నారు.
మహిళల వివాహ వయసుకు సంబంధించి కూడా ఈ రిపోర్ట్ కీలక విషయాలను వెల్లడించింది. దేశవ్యాప్తంగా బాల్య వివాహాలు తగ్గుతున్నప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో ఇంకా కొనసాగుతున్నాయి. జాతీయ స్థాయిలో 2.1 శాతం మంది బాలికలకు 18 ఏళ్ల లోపే వివాహం జరుగుతోంది. పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా 6.3 శాతం, జార్ఖండ్‌లో 4.9 శాతం బాల్య వివాహాలు నమోదయ్యాయి. ఢిల్లీ, కేరళ రాష్ట్రాల్లో బాల్య వివాహాలు దాదాపు సున్నా స్థాయికి చేరుకోవడం విశేషం.
పట్టణ.. గ్రామీణ ప్రాంతాల మధ్య మహిళల వివాహ వయసులో స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో సగటు వివాహ వయసు 22.6 ఏళ్లుగా ఉంటే.. పట్టణాల్లో ఇది 24.4 ఏళ్లుగా ఉంది. విద్యాభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు పెరగడంతో మహిళలు వివాహాన్ని కాస్త ఆలస్యంగా చేసుకుంటున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో విద్యాశాతం, ఆర్థిక స్వాతంత్ర్యం ఎక్కువగా ఉండటమే విడాకులు, ఒంటరి జీవనానికి ఒక కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్థికంగా నిలదొక్కుకున్న మహిళలు రాజీ పడి జీవించేందుకు ఇష్టపడకపోవడం కూడా ప్రధాన కారణం.
తాజావార్తలు
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!