India: చరిత్రలో తొలిసారి, 12 అణు వార్హెడ్లను మోహరించిన భారత్..
- భారత అణు విధానంలో స్పష్టమైన మార్పు..
- తొలిసారిగా 12 అణు వార్హెడ్ల మోహరింపు..
- వివరాలు వెల్లడించిన సిప్రి రిపోర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India: అణు ఆయుధ విధానంలో భారత్ స్పష్టమైన మార్పు చేసినట్లు తెలుస్తోంది. భారత్ తొలిసారిగా 12 అణు వార్హెడ్లను మోహరించినట్లు స్టాక్‌హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ (SIPRI) తన తాజా నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. దశాబ్ధాలుగా అణ్వాయుధాలను, వాటిని ప్రయోగించే వ్యవస్థలను వేర్వేరుగా ఉంచే విధానాన్ని భారత్ అవలంభిస్తోంది. కానీ తాజా నివేదిక ప్రకారం, భారత్ ప్రయోగించే స్థితిలో అణు ఆయుధాలను ఉంచినట్లు తెలుస్తోంది.
భూగర్భ క్షిపణి స్థావరాలలో, కొత్త అణు జలాంతర్గాములలో ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్న అణ్వాయుధాలను మోహరించినట్లు నివేదిక వెల్లడించింది. ఇది దేశ అణ్వాయుధ సంసిద్ధతను సూచిస్తోంది. ఇప్పటి వరకు భారత్ శాంతికాలంలో అణు వార్హెడ్లను క్షిపణుల నుంచి వేరే చేసి భద్రపరస్తుందనే అభిప్రాయం ఉండేది. అయితే, ఇటీవల క్షిపణులను కానిస్టర్లలో నిల్వ చేయడం, అణు సామర్థ్యం కలిగిన జలంతర్గాముల్లో మోహరించడం వంటివి చేసిందని నివేదిక చెప్పింది.
Also Read
- Breakfast Scheme: స్కూల్ పిల్లలకు గుడ్‌న్యూస్.. ఉచిత టిఫిన్ పథకం ప్రారంభం.. మెనూ ఇదే..
- LPG Cylinder Shortage: హోర్ముజ్ సంక్షోభం.. భారత్‌లో ఎల్పీజీ కొరతపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి..
- Ayodhya Ram Temple: రామ మందిరంలో 105 సార్లు కానుకలు కొట్టేశారు.. సుప్రీంకోర్టుకు సిట్ సంచలన నివేదిక
- EPFO నిబంధనల్లో కీలక మార్పు.. ఏం మారుతుందో తెలుసుకోండి..!
ఇదిలా ఉంటే, భారత్ అణు విధానంలో ‘‘నో ఫస్ట్ యూజ్’’ పాలసీని కొనసాగిస్తోంది. భారత్ ఎప్పటికి ఎవరిపై కూడా ముందుగా అణు దాడి చేయదు. ఒక వేళ భారత్ భూభాగం, భారత సైన్యంపై అణు దాడి జరిగితే మాత్రమే ప్రతీకార చర్యగా అణ్వాయుధాలను ఉపయోగిస్తుంది. మరోవైపు, భారత్ తన అణ్వాయుధాల నిల్వను పెంచుకున్నట్లు నివేదిక వెల్లడించింది. భారత్ వద్ద జనవరి 2026 నాటికి 190 అణ్వాయుధాలు ఉన్నట్లు అంచనా వేసింది. ఇది పాకిస్తాన్ కన్నా ఎక్కువ అని చెప్పింది.
తాజావార్తలు
-
Royal Enfield Classic 350 లవర్స్‌కు గుడ్‌న్యూస్.. కొత్త కలర్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
-
Breakfast Scheme: స్కూల్ పిల్లలకు గుడ్‌న్యూస్.. ఉచిత టిఫిన్ పథకం ప్రారంభం.. మెనూ ఇదే..
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
-
Radha vs Ambika: అబద్ధాలాడుతోంది, నేను కూడా ఫిర్యాదు చేస్తా.. రాధాకు అంబిక వార్నింగ్!
ట్రెండింగ్
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!