POK killings: పీఓకేలో పాక్ హత్యాకాండ.. 30 మంది బ్రిటిష్ ఎంపీల ఆందోళన..
- అట్టుడుకుతున్న పాక్ ఆక్రమిత కాశ్మీర్..
- హక్కుల కోసం నినదిస్తున్న పీఓకే ప్రజలు..
- నిరసనకారులపై పాక్ ఆర్మీ కాల్పులు..
- పరిస్థితిపై 30 మంది బ్రిటన్ ఎంపీల ఆందోళన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
POK killings: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(POK)లోని ప్రజలు తమ హక్కుల కోసం పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. రావల్కోట ప్రాంతంలో నిరసనల్ని అణిచివేయడానికి పాకిస్తాన్ ఆర్మీ కాల్పులు జరిపింది. కాల్పుల్లో కనీసం 30 మంది మరణించినట్లు, 200 మందికి పైగా గాయపడ్డట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై యూకేలోని కాశ్మీరీ ప్రవాసులు పాకిస్తాన్ కాన్సులేట్ ముందు నిరసన చేపట్టారు. బ్కాడ్ఫోర్డ్ సిటీలో మంగళవారం(జూన్ 09)న కాశ్మీరీ నిరసనకారులు పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. పీఓకేలో శాంతియుతంగా జరుగుతున్న నిరసనలపై కాల్పులు జరిపారని వారంతా ఆరోపించారు.
ఇదే సమయంలో పాకిస్తాన్ పరిస్థితులపై 30 మంది బ్రిటిష్ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. వీరంతా పీఓకే ఘటనలపై యూకే విదేశాంగ శాఖకు లేఖ రాశారు. ఈ ఎంపీకు బ్రాడ్ఫోర్డ్ ఈస్ట్ ఎంపీ ఇమ్రాన్ హుస్సేన్ నేతృత్వం వహించారు. పీఓకేలో అరెస్టులు, కమ్యూనికేషన్ నిలిపివేత, మానవ హక్కుల ఉల్లంఘనలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. యూకే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఎంపీలు కోరారు.
Also Read
పీఓకే జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ(JAAC) పీఓకే నిరసనలకు నేతృత్వం వహిస్తోంది. ప్రజలకు సబ్సిడీ ధరలకు పిండి, చౌక విద్యుత్ ఇవ్వాలని, ప్రాంతీయ అసెంబ్లీలో కాశ్మీర్ ప్రవాసులకు కేటాయించిన 12 రిజర్వ్ స్థానాలను రద్దు చేయడంతో పాటు 38 డిమాండ్ల అమలు కోసం ఈ ఉద్యమం నడుస్తోంది. గతంలో కూడా చాలా సార్లు ఇలాగే పీఓకే ప్రజలు పాక్ ప్రభుత్వం, ఆర్మీకి వ్యతిరేకం ఆందోళనలు, నిరసనలు నిర్వహించారు.
తాజావార్తలు
-
BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
-
Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
-
Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
-
Sanju Samson: ఇక ఫెయిల్ అవ్వడు.. హాఫ్ సెంచరీలే.. సంజు శాంసన్‌పై సన్నీ కీలక వ్యాఖ్యలు!
-
Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!