బిపర్‌జాయ్ తుఫాను బీభత్సం సృష్టిస్తుంది. ప్రస్తుతం గుజరాత్ లోని పోర్ బందర్‌కు నైరుతి దిశగా 310 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. జూన్ 15 నాటికి గుజరాత్ తీర ప్రాంతాలైన సౌరాష్ట్ర, కచ్ వద్ద తీరం దాటే అవకాశం ఉంది. దీంతో ముందుజాగ్రత్త చర్యగా పశ్చిమ రైల్వే నేడు (మంగళవారం) 67 ఎక్స్‌ప్రెస్ రైళ్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు పేర్కొనింది.