దళపతి విజయ్ పేరు, #Leo హాష్ టాగ్ లు ట్విట్టర్ ని కబ్జా చేసింది. విజయ్ బర్త్ డే జూన్ 22న ఉండడంతో ఫాన్స్ అంతా సోషల్ మీడియాలో విజయ్ కి సంబంధించిన సినిమాల అప్డేట్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సమయంలో డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ ‘రెడీ నా’ అంటూ ట్వీట్ చేసి అందరికీ స్వీట్ షాక్ ఇచ్చాడు. జూన్ 22నే లోకేష్ కనగరాజ్ తో విజయ్ చేస్తున్న ‘లియో’ మూవీ టీజర్ రిలీజ్ కి సంబంధించిన అనౌన్స్మెంట్ ఏ క్షణంలో అయినా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. కోలీవుడ్ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ‘లియో’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలని మరింత పెంచాలి అంటే మేకర్స్ ప్రమోషన్స్ సాలిడ్ గా స్టార్ట్ చేయాలి. అందుకే విజయ్ బర్త్ డే రోజునే ప్రమోషన్స్ ని స్టార్ట్ చేస్తే సాలిడ్ బజ్ జనరేట్ చెయ్యొచ్చు అనేది మేకర్స్ ప్లాన్. దీపావళి రిలీజ్ టార్గెట్ గా రానున్న లియో మూవీలో విజయ్ గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నాడు. లియో మూవీ అప్డేట్ తో పాటు విజయ్ ఫాన్స్ కి జూన్ 22న కిక్ ఇచ్చే మరో న్యూస్ బయటికి వచ్చింది. లియో నుంచి ‘నా రెడీనా’ అనే లిరికల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.
ఈ డైరెక్టర్-హీరో కాంబినేషన్ లో ‘మాస్టర్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ‘బుల్స్ ఐ’ని హిట్ చెయ్యడంలో మిస్టేక్ జరిగింది. ఈసారి మాత్రం ఆ తప్పు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న లోకేష్ కనగరాజ్, పాన్ ఇండియా సంభవం సృష్టించడానికి రెడీ అయ్యాడు. 90 రోజుల్లో షూటింగ్ పార్ట్ కంప్లీట్ చెయ్యడానికి ప్లాన్ చేసుకున్న లియో చిత్ర యూనిట్, శరవేగంగా సినిమా షూటింగ్ చేస్తున్నారు. అక్టోబర్ లో ఎట్టి పరిస్థితిలో లియో సినిమా రిలీజ్ చేసి ఈ దసరా నుంచి దీపావళి వరకూ బాక్సాఫీస్ ని సొంతం చేసుకోవాలనేది లియో డైరెక్టర్-హీరో ప్లాన్ మరి ఇది ఎంత వరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి.
Ready ah?
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) June 16, 2023