Alzheimers Disease: అల్జీమర్స్ అనేది మెదడులో కణాలు చనిపోవడం వల్ల వచ్చే నాడీ సంబంధిత వ్యాధిగా చెప్పవచ్చు. ఈ వ్యాధి బారిన పడిన వారికి జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యం దెబ్బదింటాయి. వ్యాధి ప్రారంభ సంకేతాలు ఇటీవలి జరిగిన సంఘటనలు లేదా సంభాషణలను మరచిపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. అల్జీమర్స్ వ్యాధి ముదిరే కొద్ది.. వ్యక్తి తీవ్రమైన జ్ఞాపకశక్తి బలహీనతతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అంతేకాకుండా రోజువారీ పనులను నిర్వహించే సామర్థ్యాన్ని కూడా కోల్పోతాడు. తగిన చికిత్స ద్వారా మందులు వాడినట్లయితే తాత్కాలికంగా లక్షణాలను తగ్గుతాయి. ఈ చికిత్సలు కొన్నిసార్లు అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తుల పనితీరును పెంచడానికి, కొంత సమయం వరకు స్వతంత్రంగా ఉంచడానికి సహాయపడతాయి. కానీ జ్ఞాపకశక్తి క్షీణించటం వ్యక్తి రోజువారీ వ్యక్తిగత పనులను అస్థవ్యస్థం చేస్తుంది. ఆలోచనా శక్తిని కోల్పోతారు కాబట్టి.. దానిని తీవ్రమైన సమస్యగా పరిగణించి.. వెంటనే డాక్టరును సంప్రదించి అల్జీమర్స్ ఉన్నదో, లేదో నిర్ధారణ చేసుకోవాలి.
అల్జీమర్స్ వయస్సు పైబడిన వారిలో ఎక్కువగా కన్పిస్తుంది. 65 సంల వయస్సు పైబడిన ప్రతీ 9 మందిలో ఒకరు ఈ వ్యాధికి గురయ్యే అవకాశం కలిగి ఉంటారు. అయితే పలు సందర్భాలలో 40-50 సం. వయస్సు వ్యక్తులలో కూడా అల్జీమర్స్ కనిపిస్తోంది. 30 ఏళ్లలోపు వాళ్లకు ఈ వ్యాధి రావడం చాలా అరుదు అని చెప్పవచ్చు. కానీ చైనాకు చెందిన ఓ యువకుడికి 19 ఏళ్లకే అల్జీమర్స్ వచ్చిందని బీజింగ్‌లోని క్యాపిటల్ మెడికల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ప్రపంచంలో ఇంత చిన్న వయసులో ఈ వ్యాధి రావడం ఇదే తొలిసారి అని తెలిపారు. స్కూల్ లో చదువుతుండగా 17 ఏళ్ల వయస్సులోనే అతడికి జ్ఞాపక శక్తికి సంబంధించిన సమస్యలు మొదలయ్యాయి. చదువుపై శ్రద్ధ రోజురోజుకు తగ్గిపోయింది. ఏం చదివినా గుర్తుండేది కాదు. ఏడాది గడిచేసరికి అతడికి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ సమస్య వచ్చింది. దీంతో తిన్నాడా? లేదా? హోం వర్క్ చేశాడా? లేదా? అన్నది కూడా మరిచిపోవడం మొదలైంది.
Read Also: World Economy in 2023: లేటెస్ట్ వరల్డ్ ఎకనమిక్ ఔట్‌లుక్ రిపోర్టులోని వివరాలు
మెమరీ లాస్ రోజురోజుకు తీవ్రం కావడం వల్ల చివరకు అతను పాఠశాలకు వెళ్లడం కూడా మానేశాడని యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. అతడికి అన్ని పరీక్షల చేసిన అనంతరం అల్జీమర్స్‌గా నిర్ధారించుకున్నామని చెప్పారు. జ్ఞాపకశక్తికి కీలకం అయిన మెదడులోని హిప్పోక్యాంపస్ భాగం కుచించుకుపోయిందని శాస్త్రవేత్తలు చెప్పారు. పేషెంట్ కుటుంబంలో ఎవరికీ అల్జీమర్స్ వచ్చిన చరిత్ర లేదు. జన్యుపరమైన కారణాలు ఉన్నాయా? అని జీనోమ్‌ను కూడా చెక్ చేశాం. కానీ అల్జీమర్స్ కు కారణమైన జన్యువులేవీ లేవు. దీంతో ఇంత చిన్న ఏజ్ లో అతనికి ఈ డిసీజ్ ఎందుకు వచ్చిందన్నది మాత్రం అంతుచిక్కడంలేదని సైంటిస్టులు పేర్కొన్నారు. ఈ కేస్ స్టడీ వివరాలు ఇటీవల ‘అల్జీమర్స్ డిసీజ్’ జర్నల్‌లో పబ్లిష్ అయింది.
సాధారణంగా వయసు పైబడిన వాళ్ల మెదడులో బీటా అమైలాయిడ్, టీఏయూ అనే రెండు రకాల ప్రొటీన్స్ ఏర్పడటం వల్ల అల్జీమర్స్ డిసీజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే వారసత్వంగా వచ్చే అమైలాయిడ్ ప్రీకర్సర్ ప్రొటీన్ (ఏపీపీ), ప్రిసెనిలిన్1 (పీఎస్ఈఎన్1), ప్రిసెనిలిన్2 (పీఎస్ఈఎన్2) అనే జీన్స్ కు, అల్జీమర్స్‌కు సంబంధం ఉందని కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వ్యాధిని ప్రారంభంలో గుర్తించినపుడు మందులు, కుటుంబసభ్యుల సేవలు, సహకారం వల్ల అల్జీమర్స్ వ్యాధి లక్షణాలు పెరగకుండా, జీవననాణ్యత దిగజారిపోకుండా అదుపుచేయవచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ వ్యాధికి సంబంధించి ప్రస్తుతం కోలినెట్రేస్ ఇనిహిబిటర్స్, మెమంటైన్ అనే రెండు రకాల జనరిక్ మందులు అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. జ్ఞాపకశక్తి క్షీణించటం, తికమకపడటం, సరైన రీతిలో ఆలోచించలేకపోవటం వంటివి అల్జీమర్స్ వ్యాధి లక్షణాలలో కొన్నింటిని అదుపుచేసేందుకు ఈ మందులను సూచిస్తున్నారు. ఇంతకు మించి ఈ వ్యాధిని తగ్గించే చికిత్సలేవీ ప్రస్తుతం అందుబాటులోకి రాలేదు. బి12 లోపం, అనియంత్రిత థైరాయిడ్ డిజార్డర్ వల్ల కూడా జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది.
Read Also: Meghalaya Elections: షిల్లాంగ్‌లో ప్రధాని మోదీ రోడ్‌షో.. భద్రత కట్టుదిట్టం
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఆరోగ్యకరమైన అలవాట్ల ద్వారా అల్జీమర్స్ నుంచి దూరంగా ఉండవచ్చు. అల్జీమర్స్‌ను నివారించడంలో సహాయపడటానికి వ్యాయామం చాల ముఖ్యమైనది. అత్యంత నమ్మదగిన సాక్ష్యం ఏమిటంటే శారీరక వ్యాయామం అల్జీమర్స్ అభివృద్ధిని నిరోధించడంలో లేదా లక్షణాలను కలిగి ఉన్న వ్యక్తులలో వ్యాధి పురోగతిని నెమ్మదిస్తుంది. వారానికి మూడు నుంచి నాలుగు రోజులు 30 నిమిషాల మధ్యస్థంగా శక్తివంతమైన ఏరోబిక్ వ్యాయామం చేయడం మంచిది. సమతుల్య ఆహారం తీసుకోవడం, శరీర బరువును అదుపులో ఉంచుకోవడం, ధూమపానానికి దూరంగా ఉండడం వంటి ఆరోగ్యకమైన జీవనవిధానం మెదడును ఆరోగ్యంగా ఉంచటానికి తోడ్పడుతాయి. ఇవి అల్జీమర్స్ వ్యాధితో పాటు గుండె జబ్బులు, డయాబెటిస్ వంటివి రాకుండా సహాయపడతాయి. చురుకైన సామాజిక సంబంధాలు కొనసాగించటంవల్ల మెదడులోని నాడీకణాల మధ్య సంబంధాలను బలపడి మెదడు చురుకుగా పని చేస్తుంది. ఇది వ్యక్తి ఆలోచనా శక్తి దెబ్బదినకుండా ఉండటానికి కూడా తోడ్పడుతుంది.