Alzheimers: చైనాలో 19 ఏళ్ల వ్యక్తికి మెదడుకు సంబంధించిన అరుదైన వ్యాధి ‘అల్జీమర్స్’ సోకినట్లు నిర్దారణ అయింది. జ్ఞాపకశక్తిపై ఈ వ్యాధి తీవ్రప్రభావాన్ని చూపిస్తుంది. సాధారణంగా వయసు పైబడిన వారికి మాత్రమే అరుదుగా ఈ వ్యాధి వస్తుంది. అయితే 19 ఏళ్ల వ్యక్తికి రావడం ప్రపంచంలో ఇదే తొలిసారని బీజింగ్ లోని క్యాపిటల్ మెడికల్ యూనివర్సిటీ, జువాన్ వు హాస్పిటల్ పరిశోధకులు వెల్లడించారు. యువకుడి జ్ఞాపకశక్తి రెండేళ్ల కాలంలో వేగంగా క్షీణించిందని పరిశోధకులు వెల్లడించారు.
అల్జీమర్స్ అనేది మెదడులో కణాలు చనివడం వల్ల వచ్చే నాడీ సంబంధిత వ్యాధిగా చెప్పవచ్చు. ఈ వ్యాధి బారిన పడిన వారికి జ్ఞాపకశక్తి, ఆలోచనా సామార్థ్యం దెబ్బదింటాయి.