ప్రపంచ వ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాల్లో బ్రెయిన్ ట్యూమర్ కూడా ఓ కారణం. మెదడులోని కణాలు నియంత్రించలేని విధంగా పెరిగినప్పుడే ఇది వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా న్యూరో సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. బ్రెయిన్ స్ట్రోక్ , డిమెన్షియా, అల్జీమర్స్, బ్రెయిన్ ట్యూమర్ వంటి మెదడు వ్యాధులతో బాధపడుతున్న రోగుల సంఖ్య కూడా పెరుగుతోంది. వైద్యుల అభిప్రాయం ప్రకారం.. మెదడు మన మొత్తం శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం.
ఆహారం, పానీయాల నుండి లభించే అనేక ఇతర పోషకాల మాదిరిగా కాకుండా.. విటమిన్ B12 చాలా శాఖాహార ఆహారంలలో లభించదు. ఈమధ్య చాలా మందిలో ఈ లోపం చాలా సాధారణం అవుతుంది. మనిషి ఆరోగ్యం, శ్రేయస్సును నిర్వహించడానికి విటమిన్ B12 స్థాయిల కోసం సకాలంలో డాక్టర్లును సంప్రదించడం చాలా అత్యవసరం. స్థిరమైన ఆహారపు అలవాటును చేసుకోవడం, మీ దినచర్యలో సప్లిమెంట్లను చేర్చడం, అలాగే క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం లాంటివి విటమిన్ B12 లోపాన్ని నిర్వహించడంలో కీలకమైన…
Deep Sleep: నిద్ర అనేది మానవ శరీరానికి చాలా అవసరం. మన దినచర్యలో భాగం. నిద్ర మన శారీరక, మానసిక ఆరోగ్య పరిస్థితుల్లో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. శరీరం నిద్రలో ఉన్నప్పుడు కూడా మెదడు చురుకుగా ఉంటుందని కొన్ని అధ్యయనాలు నిరూపించాయి. ఇదిలా ఉంటే గాఢ నిద్ర తగ్గే కొద్ది పక్షవాతం, అల్జీమర్స్ వ్యాధితో పాటు మతిమరుపు సమస్యలు పెరుగుతాయని తాజా అధ్యయనంలో తేలింది. అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ యొక్క మెడికల్ జర్నల్ అయిన న్యూరాలజీలో…
Alzheimers: చైనాలో 19 ఏళ్ల వ్యక్తికి మెదడుకు సంబంధించిన అరుదైన వ్యాధి ‘అల్జీమర్స్’ సోకినట్లు నిర్దారణ అయింది. జ్ఞాపకశక్తిపై ఈ వ్యాధి తీవ్రప్రభావాన్ని చూపిస్తుంది. సాధారణంగా వయసు పైబడిన వారికి మాత్రమే అరుదుగా ఈ వ్యాధి వస్తుంది. అయితే 19 ఏళ్ల వ్యక్తికి రావడం ప్రపంచంలో ఇదే తొలిసారని బీజింగ్ లోని క్యాపిటల్ మెడికల్ యూనివర్సిటీ, జువాన్ వు హాస్పిటల్ పరిశోధకులు వెల్లడించారు. యువకుడి జ్ఞాపకశక్తి రెండేళ్ల కాలంలో వేగంగా క్షీణించిందని పరిశోధకులు వెల్లడించారు.
అల్జీమర్స్ అనేది మెదడులో కణాలు చనివడం వల్ల వచ్చే నాడీ సంబంధిత వ్యాధిగా చెప్పవచ్చు. ఈ వ్యాధి బారిన పడిన వారికి జ్ఞాపకశక్తి, ఆలోచనా సామార్థ్యం దెబ్బదింటాయి.