India- Russia Relations: ప్రధాని నరేంద్రమోడీ రష్యా పర్యటనపై అమెరికా ఆగ్రహంతో ఉందని బ్లూమ్‌బర్గ్ నివేదించింది. జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ దీనిపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రధాని మోడీ రష్యాలో పర్యటించారు. ఈ సందర్భంగా రష్యాలో పలు ఒప్పందాలు కుదుర్చుకోవడంతో పాటు ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అయ్యేలా ఇరువురు నేతలు సమావేశమయ్యారు. దాదాపుగా 5 ఏళ్ల తర్వాత, ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి మోడీ రష్యాకు వెళ్లడంతో ఆ దేశం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. మోడీకి, రష్యా ప్రభుత్వం అత్యున్నత పురస్కారాన్ని ప్రధానం చేసింది.
Read Also: Raghunandan Rao: పంచాయతీల కాల పరిమితి ముగిసింది.. వెంటనే ఎన్నికలు జరపాలి..
ఇదిలా ఉంటే, మోడీ రష్యా పర్యటన ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, భారత్ తమకు వ్యూహాత్మక భాగస్వామి అని, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపే సత్తా ప్రధాని మోడీ ఉందని అమెరికా వ్యాఖ్యానించింది. బయటకు ఎన్నో చెబుతున్నప్పటికీ నాటో సమావేశం వేళ ప్రధాని మోడీ రష్యాకు వెళ్లడం అగ్రరాజ్యానికి రుచించడం లేదు. ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత ప్రధాని మోదీ రష్యాలో తొలిసారిగా పర్యటించడంపై అమెరికా-భారత్ సన్నిహిత సంబంధాలపై అమెరికా ప్రభుత్వం లోపల , వెలుపల విమర్శలకు దారితీసిందని అమెరికా అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ-పుతిన్ భేటీ నాటో సమ్మిట్ జరుగుతున్న సమయంలో జరగకుండా రీ షెడ్యూల్ చేస్తారని ఆశిస్తున్నట్లు యూఎస్ విదేశాంగ శాఖ డిప్యూటీ సెక్రటరీ కర్ట్ కాంప్‌బెల్ జూలై ప్రారంభంలో విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రాతో మాట్లాడారని నివేదిక చెప్పింది.
వాషింగ్టన్ పోస్ట్ ప్రకారం.. మాస్కోతో న్యూ ఢిల్లీకి ఉన్న దీర్ఘకాలిక సంబంధాలను అమెరికా గుర్తిస్తుందని, రష్యా-చైనా మధ్య సంబంధాలను నిరోధించాలని కోరుకుంటున్నట్లు క్యాంప్‌బెల్ క్వాత్రాతో చెప్పినట్లు తెలిపింది. నాటో సమ్మిట్ సమయంలో పుతిన్‌ని మరింత ఒంటరిగా చేయాలని భావిస్తున్న తరుణంలో, మోడీ రష్యాలో ఉండటంతో యూఎస్-ఇండియా సంబంధాలపై ప్రభావం చూపిస్తాయని పేర్కొంది. యూఎస్ జాతీయ భద్రతా సలహాదారు జెక్ సల్లివాన్ మాట్లాడుతూ.. భారత్ దీర్ఘకాలిక, నమ్మకమైన భాగస్వామిగా రష్యాను కొనియాడటం మంచిది కాదని హెచ్చరించారు. రష్యా చైనాకు దగ్గర అవుతోందని, నిజానికి చైనాకి జూనియర్ పార్ట్‌నర్‌గా మారుతోందని ఆయన అన్నారు. భారత్‌పై చైనా దురాక్రమణలో రష్యా ఏ రోజైనా చైనా పక్షాన నిలిచే అవకాశం ఉందని చెప్పారు.