Greater Noida gang rape incident: దేశంలో ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా.. కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. ప్రతీ రోజూ దేశంలో ఎక్కడోొ ఓ చోట అత్యాచార సంఘటనలు బయటపడుతూనే ఉన్నాయి. చాలా కేసుల్లో నమ్మకంగా ఉన్న వారే అమ్మాయిలు, మహిళలు, బాలికల పట్ల అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. వావీ వరసలు, చిన్నాపెద్దా తేడా లేకుండా అత్యాచారాలకు తెగబడుతున్నారు.
ముగ్గురు యువకులు 4-6 నెలల నుంచి ఓ యువతిపై సామూహిక అత్యాచారాని పాల్పడుతున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అత్యాచారాన్ని వీడియో తీసి యువతిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు నిందితులు. ఈ విషయం తల్లికి తెలియడంతో ఆమె గ్రేటర్ నోయిడా పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టింది. నిందితుడు తన కుమార్తెను ఇతర వ్యక్తలతో శారీరక సంబంధాలు పెట్టుకోవాాలంటూ బలవంతం చేస్తున్నట్లు ఫిర్యాదు చేసింది.
Read Also: John Abraham: చేయని తప్పుకి శిక్ష.. జాన్ అబ్రహంపై విమర్శలు
యూపీ గౌతమ బుద్ధ నగర్ జిల్లాలోని ఓ గ్రామంలో బాధిత యువతి 12వ తరగతి చదువుతోంది. గతేడాది నాలుగు నుంచి ఆరు నెలల వ్యవధిలో ముగ్గురు వ్యక్తులు 18-19 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడుతున్నట్లు పోలీసులు గురువారం వెల్లడించారు. అసభ్యకరమైన వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు ఫిర్యాదు వచ్చినట్లు తెలిపారు. అత్యాచారం కేసులలో భాగంగా సెక్షన్ 376 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
నేరం ఎక్కడ జరిగిందనేది స్పష్టంగా తెలియదని.. అయితే చాలా కాలంగా అనేక సార్లు అత్యాచారం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల్లో ఒకరు ముందుగా బాధిత యువతితో స్నేహం చేశాడని.. ఆ తరువాత బ్లాక్ మెయిల్ చేస్తూ అత్యాచారానికి పాల్పడినట్లు తేలింది. ఈ వీడియోను మరో ఇద్దరికి పంపించాడని, వారు కూడా అత్యాచారాని పాల్పడ్డారని బాధితురాలి తల్లి ఆరోపించింది. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు టీములను ఏర్పాటు చేశారు.