High Blood Pressure: ప్రస్తుత రోజుల్లో అధిక రక్తపోటు(హై బీపీ) చాలా మందికి ఒక సాధారణ సమస్యగా మారింది. ఇది పూర్తిగా నయం కాకపోయినా, సరైన ఆహారం, వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలితో నియంత్రణలో ఉంచుకోవచ్చు. రక్తపోటును అదుపులో ఉంచడానికి మందులు సహాయపడుతుంటాయి.
Low BP vs High BP: రక్తపోటు (బిపి) అనేది మన ఆరోగ్యంలో కీలకమైన అంశం. ఎందుకంటే, ఇది మన ధమనుల గోడలకు వ్యతిరేకంగా రక్తం యొక్క శక్తిని కొలుస్తుంది. సాధారణంగా ఒక ఆరోగ్యకరమైన రక్తపోటు 120/80 mmHg ఉంటుంది. అయితే రక్తపోటు ఈ సాధారణ పరిధి నుండి పక్కకు వెళ్లే సందర్భాలు ఉన్నాయి. ఇది తక్కువ రక్తపోటు (హైపోటెన్షన్), అధిక రక్తపోటు (హైపెర్టెన్షన్) అని పిలువబడే పరిస్థితులకు దారితీస్తుంది. ఇప్పుడు తక్కువ రక్తపోటు, అధిక రక్తపోటు…
మనిషి రోజూ తీసుకునే ఆహారం, జీవన విధానం వల్లే వ్యాధులు సంక్రమిస్తుంటాయి. కొన్ని రకాల వ్యాధులు మనల్ని జీవితాంతం మంచానికే పరిమితం చేస్తాయి. అలాంటి వాటిట్లో ఒకటి పక్షవాతం. పక్షవాతానికి అధిక రక్తపోటు అతి పెద్ద కారకం.
The Lancet Report:దేశంలో గుట్టుచప్పుడు కాకుండా బీపీ, షుగర్ తో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా ది లాన్సెట్ డయాబెటిక్ అండ్ ఎండోక్రైనాలజీ జర్నల్ నివేదికలో ఈ విషయం వెల్లడైంది. దేశ జనాభాలో 11.4 శాతం మంది షుగర్ తో బాధపడుతున్నారు.
Hypertension Day: హై బీపీ ఈరోజు సర్వసాధారణం. అధిక బీపీకి అనేక కారణాలున్నాయి. వాటిలో ఒకటి శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం. ఎలివేటెడ్ కొలెస్ట్రాల్ మరియు అధిక BP మీ రక్త నాళాలు మరియు గుండెను త్వరగా దెబ్బతీస్తాయి.
వైద్యుడు చెప్పేవరకూ తెలియదు. ఆమాటకొస్తే పరీక్ష చేసేవరకూ వైద్యుడికే తెలియదు. అంత మాయదారి సమస్య హైపర్‌టెన్షన్. నియంత్రణలో ఉంచుకుంటే బానిసలా పడి ఉంటుంది. లక్ష్మణరేఖ దాటగానే.. దశకంఠుడిలా విజృభిస్తుంది. సకల రోగాలకూ స్వాగతద్వారం అవుతుంది. బీపీ విషయంలో జీవనశైలి సర్దుబాటుకు సాటివచ్చే చికిత్సా విధానమే లేదు. అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్).. నిశ్శబ్దంగా దాడి చేస్తుంది. చాపకింద నీరులా విస్తరిస్తుంది. సునామీలా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ప్రళయమై జీవితాన్ని కబళిస్తుంది. మారుతున్న జీవన శైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, నామమాత్రమైన…