Tamil Nadu Governor: Tamil Nadu Governor:మూడేళ్లకు పైగా 10 బిల్లును ఆమోదించకుండా ఉన్న తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిపై ఇటీవల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. గవర్నర్ ఆమోదం లేకుండానే, దేశ చరిత్రలో తొలిసారిగా బిల్లులు ఆమోదం పొందాయి. ఇదిలా ఉంటే, మరోసారి గవర్నర్ రవి వివాదంలో ఇరుక్కున్నారు. విద్యార్థులను ‘‘జైశ్రీరాం’’ నినాదం చేయాలని కోరడం ఇప్పుడు తమిళనాడులో వివాదంగా మారింది.
Supreme Court: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. డీఎంకే నేత కే పొన్ముడిని మంత్రివర్గంలో చేర్చుకునేందుకు గవర్నర్ నిరాకరించడంపై ఈ రోజు అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా మండిపడింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానిస్తూ.. ‘గవర్నర్ సుప్రీంకోర్టును ధిక్కరిస్తున్నారు’’అని అన్నారు. గవర్నర్ రాజ్యాంగాన్ని అనుసరించకపోతే, ప్రభుత్వం ఏం చేస్తుంది..? అని కేంద్రాన్ని సుప్రీం ప్రశ్నించింది. పొన్ముడిని మంత్రిగా నియమించేందుకు గవర్నర్‌కి…
Tamil Nadu: తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల్లో గవర్నర్ వర్సెస్ సీఎంగా పోరు జరుగుతోంది. ఇటీవల పంజాబ్ గవర్నర్ భన్వరీ లాల్ పురోహిత్ వ్యవహార శైలిపై, అక్కడి ఆప్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గవర్నర్ పురోహిత పలు కీలక బిల్లులకు ఆమోదం తెలపడం లేదని సీఎం భగవంత్ మాన్ సర్కార్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్లు నిప్పుతో చెలగాలమాడుతున్నారని మండిపడింది. ఈ కేసు విచారణ సందర్భంగా తమిళనాడు…
తమిళనాడులో రాజ్ భవన్‌లో అర్ధరాత్రి వరకు పొలిటికల్ హైడ్రామా సాగింది. మంత్రి పదవి నుంచి సెంథిల్ బాలాజీని తొలగిస్తున్నట్టు గవర్నర్ ఆర్ఎన్ రవి జారీ చేసిన ఉత్తర్వులను ఆయన వెనక్కి తీసుకున్నారు. ప్రస్తుతానికి ఆ నిర్ణయాన్ని నిలిపి ఉంచారని తెలుస్తోంది.
తమిళనాడు గవర్నర్, ఆ రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం ముదిరింది. అసెంబ్లీ నుంచి గవర్నర్ రవి వాకౌట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్ని మాత్రమే స్పీకర్ రికార్డ్ చేయాలని, గవర్నర్ జోడించిన లేదా దాటవేయబడిన భాగాలను తొలగించాలని కోరుతూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ఈరోజు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.