Infiltrators: అక్రమంగా తమ రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తున్న బంగ్లాదేశీయులపై పలు ఈశాన్య రాష్ట్రాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా, అస్సాం, త్రిపురతో పాటు చాలా ఈశాన్య రాష్ట్రాలు బంగ్లాదేశీ చొరబాటుదారులతో విసిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయా రాష్ట్రాలు వీరిని బహిష్కరించేందుకు చర్యల్ని ప్రారంభించాయి. ఇప్పటికే అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, అక్రమ బంగ్లాదేశీయులను గుర్తించి, వారు ఆక్రమించిన స్థలాలను విముక్తి చేస్తున్నారు.
ఢిల్లీలో అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశీయులపై కఠిన చర్యలు మొదలయ్యాయి. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) వీకే సక్సేనా దేశ రాజధానిలో అక్రమంగా చొరబడి బంగ్లాదేశీయులపై చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని ఆదేశించారు. ఈ మేరకు ఎల్జీ ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నగర పోలీస్ చీఫ్‌కి లేఖ రాశారు. రాబోయే 60 రోజుల్లో అక్రమ వలసదారుల్ని గుర్తించి నిర్ణీత కాల వ్యవధిలో వారిని బహిష్కరించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.