Bangladesh: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 26 మందిని బలిగొన్న ఈ ఉగ్రవాద ఘటన తర్వాత భారత్ పాకిస్తాన్‌పై తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే భారత్, దాయాది దేశానికి దౌత్యపరమైన షాక్‌లు ఇస్తోంది. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంతో పాటు పాకిస్తాన్ జాతీయులకు వీసాలు రద్దు చేసింది. ఇక పాకిస్తాన్‌కి బిగ్ షాక్ ఇస్తూ భారత్ తన గగనతలాన్ని పాక్ విమానాలకు బ్లాక్ చేసింది.
Read Also: Communal tension: మైనర్‌పై అత్యాచారం, మసీదుపై రాళ్లదాడి.. నైనిటాల్‌లో ఉద్రిక్తత..
ఇదిలా ఉంటే, షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా గద్దె దిగిన తర్వాత, మహ్మద్ యూనస్ అధికారం చేపట్టారు. అప్పటి నుంచి పాకిస్తాన్‌తో సంబంధాలు పెట్టుకోవడానికి తహతహలాడుతోంది. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ ప్రభుత్వంలోని సీనియర్ అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2009 బంగ్లాదేశ్ రైఫిల్స్ (BDR) ఊచకోతను దర్యాప్తు చేస్తున్న జాతీయ స్వతంత్ర విచారణ కమిషన్ చైర్‌పర్సన్ మేజర్ జనరల్ (రిటైర్డ్) A.L.M. ఫజ్లూర్ రెహమాన్ మాట్లాడుతూ.. ‘‘భారత్ పాకిస్తా్న్‌పై దాడి చేస్తే, బంగ్లాదేశ్ ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకుంటుది. ఈ విసయంలో చైనాతో ఉమ్మడి సైనిక వ్యవస్థపై చర్చలను ప్రారంభించడం అవసమరం ’’ అని బెంగాలీలో ఆయన సోషల్ మీడియా చేశారు.
Read Also: AlluArjun : మామ చిరంజీవి ఫ్యాన్స్ సపోర్ట్‌తోనే ఈ స్థాయికి వచ్చా..
ఎవరు ఫజ్లూర్ రెహ్మాన్:
2001లో బంగ్లాదేశ్-భారత్ సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో బీఎస్ఎఫ్ 16 మంది సిబ్బందిని చంపిన సమయంలో రెహ్మాన్ బీఆర్డీకి నాయకత్వం వహించారు. ప్రస్తుతం ఇతను సుప్రీంకోర్టు అప్పీలేట్ డివిజన్ జడ్జికి సమానమైన హోదాను కలిగి ఉన్నాడు. 2009లో పిల్ఖానా హత్యల వెనక విదేశీ కుట్రని వెలికి తీస్తానని చెబుతున్నాడు. పరోక్షంగా భారత్‌ని అనుమానిస్తున్నాడు.