కన్నడ నటి రన్యారావుతో తెగతెంపులు చేసుకునేందుకు ఆమె భర్త జతిన్ హుక్కేరి రెడీ అయ్యాడు. నాలుగు నెలల క్రితమే ఇద్దరికీ వివాహం అయింది. కానీ ఏనాడూ అతడితో సంసారం చేయలేదు. వ్యాపారాలు పేరుతో విదేశాలకు వెళ్తూ ఉండేదని.. ఒక్క నెల కూడా తనతో సరిగ్గా లేదని ఇటీవల విచారణ సందర్భంగా డీఆర్ఐ అధికారుల ముందు జతిన్ హుక్కేరి వాపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
బంగారం స్మగ్లింగ్ చేస్తూ ఈనెల 3న బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డ కన్నడ నటి రన్యారావు కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డీఆర్ఐ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా రూ.12 కోట్లకుపైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమె ఇంట్లో సోదాలు చేయగా రూ.3 కోట్ల విలువైన ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు.
కన్నడ నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా రన్యారావుతో తెలుగు నటుడు తరుణ్ రాజుకు ఉన్న సంబంధాల గురించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తరుణ్ రాజ్ బెయిల్ పిటిషన్ సందర్భంగా ఇరువర్గాల వాదనల్లో కొత్త విషయాలు బయటకొచ్చాయి.
కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ పై బెంగళూరులోని హై గ్రౌండ్స్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. నటి రన్యా రావు తరపున ఆకుల అనురాధ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో నటిపై అసభ్యకరమైన, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసి యత్నాల్ పరువు నష్టం కలిగించారని ఆరోపించారు. పోలీసులు బీజేపీ ఎమ్మెల్యేపై బిఎన్‌ఎస్ సెక్షన్ 79 కింద కేసు నమోదు చేశారు. కర్ణాటకలోని బీజాపూర్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే, కేంద్ర మాజీ మంత్రి…
బంగారం స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డ కన్నడ నటి రన్యారావు వ్యవహారం కుటుంబ సభ్యులకు కష్టాలు తెచ్చిపెట్టింది. ఆమె ఒక్కదానితోనే ఈ కేసు నడవడం లేదు. ప్రస్తుతం ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న డీఆర్ఐ అధికారులు.. మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు.
బంగారం స్మగ్లింగ్ కేసులో నిందితురాలైన నటి రన్యారావు ప్రత్యేక కోర్టులో బెయిల్ పిటిషన్ వేసింది. ఈ సందర్భంగా మంగళవారం రన్యారావు తరపున న్యాయవాది కిరణ్ జవాలి వాదనలు వినిపించారు. మార్చి 3న అరెస్టైన దగ్గర నుంచి రన్యారావును డీఆర్ఐ అధికారులు మానసికంగా వేధించారని.. ఆమెకు నిద్రలేకుండా చేశారని తెలిపారు.
గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో సంచలనంగా మారిన విషయం ఏదైనా ఉందంటే అది నటి రన్యారావ్ బంగారం స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోవడమే. ఈమె వ్యవహారం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. గోల్డ్ స్మగ్లింగ్ కు పాల్పడుతున్న రన్యారావును డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటుంది. తాజాగా మరో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. రన్యారావుపై డీఆర్ఐ అధికారులకు ఫిర్యాదు చేసింది ఆమె భర్తేనని తెలిసింది. పెళ్లైన రెండు నెలల…
బంగారం స్మగ్లింగ్ కేసులో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రధాన నిందితురాలు, నటి రన్యారావు స్నేహితుడు, అట్రియా హోటల్ యజమాని మనవడు తరుణ్ రాజును బెంగళూరులో డీఆర్ఐ అధికారులు సోమవారం అరెస్ట్ చేశారు. తరుణ్ రాజును కోర్టులో హాజరుపరచగా ఐదు రోజులు డీఆర్ఐ కస్టడీకి అప్పగించింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు.. తరుణ్ రాజును విచారిస్తు్న్నారు.
భారతదేశంలో అత్యంత సీనియర్ ఆఫ్ఘన్ దౌత్యవేత్త జకియా వార్దక్ తన పదవికి రాజీనామా చేశారు. వాస్తవానికి ఆమె దుబాయ్ నుండి సుమారు రూ. 19 కోట్ల విలువైన 25 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలించిన ఆరోపణలపై గత వారం ముంబై విమానాశ్రయంలో పట్టుబడ్డారు.