బంగారం స్మగ్లింగ్ కేసులో నిందితురాలైన నటి రన్యారావు ప్రత్యేక కోర్టులో బెయిల్ పిటిషన్ వేసింది. ఈ సందర్భంగా మంగళవారం రన్యారావు తరపున న్యాయవాది కిరణ్ జవాలి వాదనలు వినిపించారు. మార్చి 3న అరెస్టైన దగ్గర నుంచి రన్యారావును డీఆర్ఐ అధికారులు మానసికంగా వేధించారని.. ఆమెకు నిద్రలేకుండా చేశారని తెలిపారు.