In Car: నలుగురు రాక్షసుల చేతిలో నలిగిన గులాబీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
In Car: గురు సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన హీరోయిన్ రితికా సింగ్. మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డు అందుకున్న ఈ చిన్నది.. ఆ సినిమా తర్వాత అంతటి ఘనవిజయాన్ని మాత్రం తెలుగులో అందుకోలేకపోయింది. ఇక కోలీవుడ్ లో ఓ మై కడువులే అనే సినిమాతో అక్కడ కూడా మంచి విజయాన్ని అందుకొని స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు సై అంటున్న రితికా.. తాజాగా ఇన్ కార్ అనే ఒక ప్రయోగత్మకైమన సినిమాలో నటిస్తోంది. హర్ష్ వర్ధన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఇన్ బాక్స్ పిక్చర్స్ బ్యానర్ పై అంజుమ్ ఖురేష్, సాజిద్ ఖురేషి నిర్మిస్తున్నారు. తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా మార్చి 3 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. ప్రమోషన్స్ లో భాగంగా సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
Venkatesh: వెంకీ మామ నోటి వెంట బూతు పురాణం.. వినలేం
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. నలుగురు రాక్షసుల చేతిలో నలిగిన గులాబీగా రితికా సింగ్ కనిపిస్తోంది. ఒక బస్టాండ్ లో బస్సు కోసం ఎదురుచూస్తున్న రితికాను నలుగురు డబ్బున్న కుర్రాళ్ళు ట్రాప్ చేసి కారులో ఎక్కించుకొని వెళ్ళిపోతారు. ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేయాలనుకుంటారు. వారి నుంచి రితికా ఎలా తప్పించుకొంది. చివరికి ఆమె వారిని పోలీసులకు అప్పగించిందా..? అసలు ఆ నలుగురు ఎవరు..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. అందరు చూస్తుండగానే ఒక అమ్మాయిని కారులో తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపేసిన ఘటనలు ఎన్నో చూస్తూనే ఉన్నాం. ఈ సినిమా కూడా వాస్తవ సంఘటనలకు దగ్గర ఉన్నట్లు తెలుస్తోంది. సహాయం చేసేవారు లేక.. వారికి లొంగిపోయి.. నన్ను మీరు ఏది కావాలంటే అది చేసుకోమని రితికా బతిమిలాడడం, వారి నుంచి తప్పించుకోవడానికి ఎన్ని దారులు ఉన్నాయో అన్ని దారులు ఉపయోగిస్తూ వారికి దొరికిపోవడం, అమ్మాయి అని కూడా చూడకుండా ఆ నలుగురు రాక్షసులు.. రితికాను ఇష్టమొచ్చినట్లు కొట్టడం లాంటివి చూస్తుంటే సినిమాపై ఎంతో ఆసక్తి కలుగుతోంది. చివరికి రితికా తప్పించుకుందా..? లేదా అనే ఆతృతను డైరెక్టర్ ప్రేక్షకులలో కలిగించి సినిమా చూడాలనే ఆసక్తిని పెంచాడు. మరి ఈ సర్వైవల్ కథతో రితికా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!