Chiranjeevi: ఈ కొరియన్ కనకరాజు సక్సెస్ కి కారణం మా వరుణ్ తేజ్ కొడుకే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక సినిమా విజయం సాధిస్తే అది కేవలం కలెక్షన్ల వర్షం కురిపించడమే కాకుండా, ఆ చిత్రంతో ముడిపడి ఉన్న వందలాది కుటుంబాలలో ఎనలేని ఆనందాన్ని నింపుతుందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన వినూత్న చిత్రం ‘కొరియన్ కనకరాజు’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించిన సందర్భంగా నిర్వహించిన సక్సెస్ సెలబ్రేషన్స్‌కు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ “సినిమా హిట్ అయిన వెంటనే దీని విజయాన్ని పదిమందితో పంచుకోవాలని, ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలపాలని వరుణ్ నన్ను ఆహ్వానించాడు. ఒక సినిమా విజయం సాధిస్తే బయ్యర్లు, ఎగ్జిబిటర్ల బ్యాంక్ అకౌంట్లు నిండటమే కాకుండా, రోజువారీ పనిచేసే సినిమా కార్మికుల కుటుంబాలకు కడుపు నిండుతుంది. నిర్మాతలు, నటీనటులు ఎంతో ఆనందాన్ని పొందుతారు. ఇంతటి గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకదేవుళ్లకు తలవంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను.” అన్నారం
Also Read
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
- Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
- Anirudh Ravichander: రామ్ చరణ్ - సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
- Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
నటుడిగా వరుణ్ ప్రయత్నం అభినందనీయం
తన కుమారుడు వరుణ్ తేజ్ గురించి మాట్లాడుతూ, “నేను ఇక్కడ ఒక తండ్రిగా మాట్లాడటం లేదు. వరుణ్ ఎప్పుడూ సేఫ్ జోన్లో ఉండటానికి ఇష్టపడడు. కేవలం కమర్షియల్ సినిమాలు చేసేసి స్టార్డమ్ తెచ్చుకోవాలనే తాపత్రయం అతనిలో లేదు. వైవిధ్యమైన కథలను, కొత్త తరహా జోనర్లను ఎంచుకుంటూ ఒక మంచి నటుడిగా నిలదొక్కుకోవాలనేదే తన ఆరాటం. కొన్నిసార్లు ఫలితాలు అటుఇటు కావచ్చు, కానీ ఒక నటుడిగా వరుణ్ ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. అదే ధైర్యంతో, కాన్ఫిడెన్స్‌తో ముందుకు వెళ్ళు.. నువ్వు తప్పకుండా వెర్సటైల్ యాక్టర్‌గా స్థిరపడతావు” అని వరుణ్ తేజ్‌కు దిశా నిర్దేశం చేశారు. అలాగే సరదాగా స్పందిస్తూ, “ఈ విజయాన్ని వరుణ్ తన ఖాతాలో వేసుకోవద్దు, ఇది మన బుడ్డోడు ‘వాయు తేజ్’ తెచ్చిన అదృష్టం, వాడే మన లక్కీ చార్మ్” అని నవ్వేశారు.
తాజావార్తలు
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..