Nagababu: మాకు ప్రాణ వాయువు మా అన్నయ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన Korean Kanakaraju బాక్సాఫీస్ వద్ద భారీ విజయంతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన మెగా బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్ వేడుకలో నటుడు నాగబాబు చేసిన కామెంట్స్ ప్రస్తుతం సినీ వర్గాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకలో నాగబాబు మాట్లాడుతూ మెగా కుటుంబం వెనుక ఉన్న అసలైన శక్తి గురించి గుర్తు చేసుకున్నారు. తామంతా ఈ స్థితిలో ఉన్నామంటే దానికి ప్రధాన కారణం మెగాస్టార్ చిరంజీవి అని కొనియాడారు. “మేమందరం ఈ స్టేజ్ మీద ఇలా ఉన్నామంటే మా అందరికీ ప్రాణవాయువు లాంటివాడు మా అన్నయ్య గారు. పవన్ కళ్యాణ్, నేను, చరణ్, వరుణ్, తేజు, వైష్ణవ్, నిహారిక.. ఇలా మేమందరం కూడా ఆయన ఆశీస్సులు, ఆయన ఇన్స్పిరేషన్ వల్లే ఈ స్థాయికి వచ్చాం. ఆయన మా జీవితంలో ఎప్పుడూ ఒక ఫాదర్ ఫిగర్” అంటూ ఎమోషనల్ అయ్యారు. వరుణ్ తేజ్‌తో ఉన్న చిన్ననాటి జ్ఞాపకాలను ఆయన ఈ సందర్భంగా నెమరువేసుకున్నారు.
వరుణ్ చిన్నతనంలో అన్నయ్య చిరంజీవి స్వయంగా ఎత్తుకుని పెంచారని, తాను చేసే ప్రతి సినిమా ప్రివ్యూకి వరుణ్‌ను ప్రత్యేకంగా తీసుకెళ్లేవారని గుర్తు చేసుకున్నారు. ఇంటి వద్ద వరుణ్ ఎప్పుడూ ఎంతో వినయంగా, విధేయతతో మెలుగుతాడని చెప్పారు. తను, వరుణ్ సాధారణ విషయాలు మాట్లాడుకున్నప్పటికీ, అన్నయ్యతో మాత్రం వరుణ్ ఫిలిం మేకింగ్, కెమెరా టెక్నిక్స్ వంటి లోతైన విషయాలపై సుదీర్ఘంగా చర్చిస్తుంటాడని తెలిపారు. అన్నయ్య కూడా వరుణ్‌ను అంత ఆప్యాయంగా గమనిస్తూ, ఇంట్రెస్ట్‌గా విషయాలు చెబుతుంటారని తెలిపారు.కుటుంబంలో ఎవరికి ఏ చిన్న సమస్య వచ్చినా చిరంజీవి ముందుండి పరిష్కరిస్తారని, తాము మర్చిపోయినా ఆయనే స్వయంగా గుర్తుపెట్టుకుని అండగా నిలుస్తారని నాగబాబు తెలిపారు. చిరంజీవి ఆశీస్సులు, పవన్ కళ్యాణ్ బలం వెన్నెముకగా ఉన్నంత కాలం తాము పరిశ్రమలో మంచి విజయాలు సాధించగలమన్న నమ్మకం ఉందని పేర్కొన్నారు.
Also Read
- Kamal : సిద్ధా' డైరెక్టర్‌తో కమల్ హాసన్ పవర్ ప్యాక్డ్ ప్రాజెక్ట్..
- Chadalawada : పదవులు కావాల్సింది సీఎంల పక్కన ఫోటోలకా?
- Yash Toxic: రేపు యశ్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్! ‘టాక్సిక్’కు మళ్లీ థియేట్రికల్ ట్రీట్.. కానీ ఈసారి స్పెషల్ వెర్షన్
- C Kalyan : ఒక్క సినిమా తీసిన నిర్మాతకు సైతం మెడిక్లైమ్ కార్డులు అందేలా చూస్తా
తాజావార్తలు
-
Kamal : సిద్ధా’ డైరెక్టర్‌తో కమల్ హాసన్ పవర్ ప్యాక్డ్ ప్రాజెక్ట్..
-
Whatsapp Update: ఇకపై వాట్సాప్ నుంచే కరెంట్, వాటర్ బిల్లులు.. 22 వేలకుపైగా బిల్లర్లతో సరికొత్త సేవలు.!
-
Yasha Nagula : యూట్యూబ్‌ను షేక్ చేసిన ‘యేషనాగుల’.. 5 రోజుల్లోనే 50 మిలియన్ల వ్యూస్!
-
Konda Surekha: నేనేం తప్పు చేశాను.. కాంగ్రెస్ అధిష్టానంతో యుద్ధానికి సిద్ధమవుతున్న మంత్రి సురేఖ!
-
Chadalawada : పదవులు కావాల్సింది సీఎంల పక్కన ఫోటోలకా?
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!