Bharat: తాజాగా “ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్”.. మరోసారి పేరు మార్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bharat: కేంద్రం ‘ఇండియా’ పేరును ‘భారత్’గా మారుస్తుందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. దీనికి బలం చేకూరుస్తూ.. నిన్ని జీ20 విందు ఆహ్వానంలో ‘ప్రెసిడెండ్ ఆఫ్ ఇండియా’ బదులుగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ప్రచురించడం ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. సెప్టెంబర్ 18-22 మధ్య జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ పేరు మార్పుపై బిల్లు ప్రవేశపెడతారని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు కేంద్రం చర్యలను కాంగ్రెస్, ఆప్, టీఎంసీ పలు పార్టీలు విమర్శిస్తున్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా అగ్నికి ఆజ్యం తోడైనట్లుగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ 20వ ఆసియాన్-ఇండియా సమ్మిట్ మరియు 18వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సు కోసం బుధ, గురువారాల్లో ఇండోనేషియా పర్యటనకు వెళ్లననున్నారు. దీనికి సంబంధించిన పత్రంలో ‘‘ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా’’కు బదులుగా ‘‘ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్’’గా పేర్కొన్నారు. దీంతోొ మరోసారి ఇండియా పేరు భారత్ గా మారుతుందనే ఊహాగానాలు బలపడ్డాయి.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
Read Also: Google vs Teachers: గురువుల కన్నా గూగుల్ మిన్న..! ఏపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఈ ఆహ్వానానికి సంబంధించిన నోట్ ను ఎక్స్(ట్విట్టర్)లో పంచుకున్నారు. ఇందులో ‘ఆసియాన్-ఇండియా సమ్మిట్’తో పాటు ‘ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా’ అని కూడా ఉంది. మరోవైపు కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ట్విట్టర్ పోస్టులు ‘‘ మోడీ ప్రభుత్వం ఎంత గందరగోళంలో పడిందో చూడండి..20వ ఆసియాన్-ఇండియా సమ్మిట్‌లో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ప్రతిపక్షాలు కలిసి ఇండియా కూటమి పెట్టుకోవడంతోనే ఇదంతా డ్రామా’ అంటూ వ్యాఖ్యానించారు.
కేంద్రం చర్యలపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ప్రతిపక్షాలు ఇండియా కూటమి పేరును భారత్ గా మార్చుకుంటే, ఆ పార్టీ భారత్ పేరును బీజేపీగా మారుస్తుందా..? ఈ దేశం ఒక్కపార్టీది కాదని 140 కోట్ల మందిదని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. మరోవైపు బీజేపీ నేతలు భారత్ అనే పదాన్ని స్వాగతిస్తున్నారు. అస్సాం సీఎం హిమంత బిశ్వసర్మ దీనికి మద్దతు తెలిపారు. బీజేపీ జాతీయాద్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ.. దేశ ప్రతిష్టతను పెంచే ప్రతీ పనికి కాంగ్రెస్ అడ్డు చెబుతోందని విరుచుకుపడ్డారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!