Bharat: కేంద్రం ‘ఇండియా’ పేరును ‘భారత్’గా మారుస్తుందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. దీనికి బలం చేకూరుస్తూ.. నిన్ని జీ20 విందు ఆహ్వానంలో ‘ప్రెసిడెండ్ ఆఫ్ ఇండియా’ బదులుగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ప్రచురించడం ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. సెప్టెంబర్ 18-22 మధ్య జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ పేరు మార్పుపై బిల్లు ప్రవేశపెడతారని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు కేంద్రం చర్యలను కాంగ్రెస్, ఆప్, టీఎంసీ పలు పార్టీలు విమర్శిస్తున్నాయి.