'Bharat' controversy: ‘ఇండియా’ పేరు ‘భారత్’గా మారుస్తున్నారంటూ దేశవ్యాప్తంగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. సెప్టెంబర్ 18-22 వరకు జరిగే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లు పెడతారని అంతా అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై ఐక్యరాజ్యసమితి(యూఎన్) స్పందించింది. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ డిప్యూటీ స్పోక్స్ పర్సన్ ఫర్హాన్ హక్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాల పేర్లు మార్చుకోవాలని ఆ దేశాలు అనుకున్నప్పుడు యూఎన్ వాటిని పరిగణలోకి తీసుకుంటుందని ఆయన అన్నారు.
Bharat: కేంద్రం ‘ఇండియా’ పేరును ‘భారత్’గా మారుస్తుందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. దీనికి బలం చేకూరుస్తూ.. నిన్ని జీ20 విందు ఆహ్వానంలో ‘ప్రెసిడెండ్ ఆఫ్ ఇండియా’ బదులుగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ప్రచురించడం ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. సెప్టెంబర్ 18-22 మధ్య జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ పేరు మార్పుపై బిల్లు ప్రవేశపెడతారని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు కేంద్రం చర్యలను కాంగ్రెస్, ఆప్, టీఎంసీ పలు పార్టీలు విమర్శిస్తున్నాయి.
Arvind Kejriwal: కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఇండియా పేరును ‘రిపబ్లిక్ ఆఫ్ భారత్’ని మారుస్తుందని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. సెప్టెంబర్ 18-22 వరకు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.