కరోనా ఎంట్రీ తర్వాత పరిస్థితి మొత్తం మారిపోయింది.. విద్యా వ్యవస్థపై పెను ప్రభావాన్ని చూపించింది.. చదువులను నాశనం చేసింది మహమ్మారి.. స్కూళ్లు, కాలేజీలు, యూవనిర్సిటీలు.. ఇలా విద్యాసంస్థలు అన్నీ మూతబడ్డాయి.. దాంతో, ఆన్‌లైన్ పాఠాలకే పరిమితం అయ్యారు విద్యార్థులు.. ఆన్‌లైన్ క్లాసుల పుణ్యమా? అని ప్రతీ విద్యార్థి చేతికి స్మార్ట్‌ఫోన్ వచ్చింది.. చదవువులు తక్కువ..! ఆన్‌లైన్ గేమ్‌లు ఎక్కువ అనే పరిస్థితి తీసుకొచ్చింది.. అయితే, మహమ్మారి తగ్గుముఖం పట్టి.. సాధారణ పరిస్థితులు వచ్చిన తర్వాత యథావిథిగా విద్యాసంస్థలు నడుస్తున్నాయి.. అయితే, ఇప్పుడు కొత్త వేరియంట్ భయాలు వెంటాడుతున్నాయి.. ఈ తరుణంలో.. త్వరలో స్కూళ్లు, కాలేజీలు బంద్ చేస్తారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. లాక్‌డౌన్ కూడా విధించే అవకాశం ఉందని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి..
Read Also: BF-7 Covid Variant: బెంగాల్‌లో బీఎఫ్-7 కలకలం.. అమెరికా నుంచి వచ్చిన 4గురిలో గుర్తింపు
ఆ ప్రచారంలో నిజం ఎంత అనిదానిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పందించింది. ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని కొట్టిపారేసింది.. ఇదంతా నిరాధారమైనది.. ఫేక్ న్యూస్ అని తేల్చేసింది.. స్కూళ్లు, కాలేజీలకు 15 రోజులు సెలవులు ప్రకటిస్తారనే బోగస్ వార్తలను ఎవరూ నమ్మవద్దని స్పష్టం చేసింది.. వాస్తవాలు తెలుసుకోవాలని ప్రజలకు సూచించింది. ఈ మేరకు ఫ్యాక్ట్ చెక్ చేసి ట్విట్టర్‌లో పోస్టు చేసింది. కాగా, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, జనవరి 4, బుధవారం, భారతదేశంలో 175 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అయినప్పటికీ, చలిగాలుల దృష్ట్యా లక్నోలోని పాఠశాలలను మూసివేయాలని ఆదేశించబడింది. జమ్మూ మరియు కాశ్మీర్, ఢిల్లీతో సహా రాష్ట్రాల్లో శీతాకాల సెలవుల కోసం పాఠశాలలు మూసివేయబడ్డాయి. పొగమంచు కారణంగా కొన్ని చోట్ల స్కూళ్ల సమయాన్ని మార్చారు. అంతేగానీ, కరోనా మహమ్మారి కారణంగా ఇచ్చిన సెలవులు కాదని స్పష్టం చేస్తున్నారు.
सोशल मीडिया पर कई खबरों को शेयर करते हुए दावा किया जा रहा है कि #Covid19 के कारण देश में लॉकडाउन लगेगा और स्कूल/कॉलेज बंद रहेंगे। #PIBFactCheck
✅ ये सभी दावे फ़र्ज़ी हैं।
✅ कोविड से जुड़ी ऐसी किसी भी जानकारी को शेयर करने से पहले #FactCheck अवश्य करें। pic.twitter.com/jLcIeI9pBn
— PIB Fact Check (@PIBFactCheck) January 4, 2023