President Muizzu: మాల్దీవుల అధినేత మహ్మద్ ముయిజ్జు నాలుగు రోజుల పర్యటన కోసం భారత్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ఇండియన్ టూరిస్టుల తమ దేశంలో పర్యటించాలని కోరారు. వారు తమ ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపిస్తారని తెలిపారు. అలాగే, భారత భద్రతను బలహీనపరిచేలా మాల్దీవులు ఎప్పటికి వ్యవహరించదని హామీ ఇచ్చారు. అలాగే, న్యూ ఢిల్లీ మాకు విలువైన భాగస్వామి అని ఆయన కొనియాడారు. ఇక, రక్షణ సహా ఇతర రంగాల్లో ప్రాధాన్యం ఉండబోతుంది.. మేం వివిధ రంగాల్లో ఇతర దేశాలతో సహకారాన్ని పెంపొందించుకుంటున్నారు.. మా చర్యలు మా ప్రాంత భద్రత, స్థిరత్వంపై రాజీ లేకుండా ఉండేలా చూసుకుంటామని మహ్మద్ ముయిజ్జు ప్రకటించారు.
Read Also: BRS MLAs: టీడీపీలో చేరుతాం.. క్లారిటీ ఇచ్చిన తీగల కృష్ణా రెడ్డి..
ఇక, మా పొరుగు దేశాలు, స్నేహితులపై గౌరవంతో వ్యవహరించడం మా డీఎన్‌ఏలో ఉందని మాల్దీవుల అధ్యక్షు ముయిజ్జు వెల్లడించారు. అలాగే, మాల్దీవ్స్ ఫస్ట్ విధానం గురించి ప్రస్తావిస్తూ.. అంతర్జాతీయ సంబంధాల్లో వైవిధ్యతను చూపడం మాల్దీవులకు చాలా అవసరం అని చెప్పుకొచ్చారు. అలాగే, ఏ ఒక్క దేశం పైనా అతిగా ఆధారపడటం తగ్గించుకోవాల్సి ఉందన్నారు. దీని వల్ల భారత ప్రయోజనాలు దెబ్బతినవని పేర్కొన్నారు. ఈ సందర్భంగానే భారత టూరిస్టులకు స్వాగతం పలికారు ముయిజ్జు.
Read Also: TTD Laddu : బెంగళూరుకు నిలిచిపోయిన తిరుపతి లడ్డూ సరఫరా
ఇదిలా ఉండగా.. మహ్మద్ ముయిజ్జు అక్టోబర్ 10 వరకు భారత్‌లో పర్యటించనున్నారు. ఇటీవల ఇరు దేశాల మధ్య ఏర్పడిన దౌత్య విభేదాల తర్వాత.. మాల్దీవుల అధినేత ముయిజ్జు భారత్‌కు రావడం ఇది సెకండ్ టైం. ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఇతర దేశాధినేతలతో పాటు హాజరైనప్పటికి నుంచి ఆ దేశ వైఖరిలో మార్పు వచ్చినట్లు పలు సంకేతాలు వచ్చాయి. ఆ తర్వాత జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఆగస్టులో మాల్దీవుల్లో పర్యటించి ఆ దేశ అధ్యక్షుడితో చర్చించారు. అయితే, చైనా అనుకూలుడిగా పేరున్న ముయిజ్జు.. అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత తుర్కియే, చైనాలో పర్యటనలు చేశారు. ముయిజ్జు అధ్యక్షుడిగా అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి భారత్- మాల్దీవుల సంబంధాలు క్షీణించాయి. తాజా, పర్యటన గురించి ప్రకటన వచ్చిన కాసేపటికే మోడీపై విమర్శలు చేసిన మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు.