కశ్మీర్ భూమిపై మరోసారి భారతీయుల రక్తం చిందింది. సెలవుల్లో ఆహ్లాదంగా గడుపుదామని పహల్గామ్ సందర్శించడానికి వెళ్లిన పర్యాటకులు మృత్యుఒడికి చేరుకున్నారు. కొత్తగా పెళ్లయిన జంటల్లో భర్త కాటికి, భార్య సొంత గూటికి చేరుకున్నారు. ఇప్పటివరకు కాశ్మీర్‌లో పర్యాటకులపై జరిగిన అతిపెద్ద ఉగ్రవాద దాడిగా దీనిని పరిగణిస్తున్నారు. ఇందులో 28 మంది మరణించినట్లు సమాచారం. అయితే.. పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న ‘లష్కరే తయ్యిబా’ అనుబంధ విభాగం ‘ద రెసిస్టెన్స్ ఫ్రంట్’ ఈ దాడికి తెగబడినట్లు ప్రకటించుకుంది.…
President Muizzu: మాల్దీవుల అధినేత మహ్మద్ ముయిజ్జు నాలుగు రోజుల పర్యటన కోసం భారత్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ఇండియన్ టూరిస్టుల తమ దేశంలో పర్యటించాలని కోరారు. వారు తమ ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపిస్తారని తెలిపారు.
Maldives: గతేడాది మాల్దీవులకు కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన మహ్మద్ ముయిజ్జూ భారత్ వ్యతిరేక, చైనా అనుకూల వైఖరి ప్రదర్శి్స్తున్నాడు. మాల్దీవుల్లో మానవతాసాయాన్ని నిర్వహిస్తున్న భారత సైనిక సిబ్బందిని వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించాడు. అటుపై చైనాతో సైనిక ఒప్పందాన్ని కుదుర్చుకుంటూ భారత్‌కి యాంటీగా వ్యవహరిస్తు్న్నాడు.
Maldives: మాల్దీవులకు కొత్త అధ్యక్షుడిగా మహ్మద్ ముయిజ్జూ వచ్చిన తర్వాత భారత వ్యతిరేక విధానాలు అవలంభిస్తూ, చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ లక్షద్వీప్ వెళ్లిన సందర్భంలో మాల్దీవుల మంత్రులు ప్రధానిని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు క్షీణించాయి. ఈ పరిణామాలతో భారత్ నుంచి మాల్దీవులకు వెళ్లే పర్యాటకులు తమ టికెట్స్, హోటల్ బుకింగ్స్ క్యాన్సిల్ చేసుకున్నారు.
Dubai: గల్ఫ్ కంట్రీ యూఏఈ భారతీయులకు శుభవార్త చెప్పింది. దుబాయ్ ఇండియన్స్ కోసం 5 ఏళ్ల మల్టీపుల్ ఎంట్రీ వీసాలను ప్రవేశపెట్టింది. ఈ వీసాలు వ్యాపారం, విహారయాత్రలను సులభతరం చేయనున్నాయి. ఇటీవల కాలంలో గల్ఫ్ కంట్రీ యూఏఈ-భారత్ మధ్య వ్యాపార సంబంధాలు విస్తృతమవుతున్నాయి. మరోవైపు విహారయాత్రకు అనువైన ప్రదేశంగా భారతీయులు దుబాయ్‌కి ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఇండియన్ టూరిస్టులకు ఇరాన్ సర్కార్ శుభవార్త చెప్పింది. భారతీయ పర్యాటకుల కోసం ఉచిత వీసా విధానాన్ని ప్రకటించింది. ఈ మేరకు ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
India-Maldives: ప్రధాని నరేంద్రమోడీ లక్షద్వీప్ పర్యటనతో మాల్దీవులు వణికిపోతున్నాయి. ఇటీవల ఎన్నికల్లో అక్కడ అధ్యక్షుడిగా మహ్మద్ మయిజ్జూ గెలిచిన తర్వాత ఏర్పడిన ప్రభుత్వం భారత వ్యతిరేక ధోరణి ప్రదర్శిస్తోంది. ఎన్నికల వాగ్దానాల్లో ఎక్కువగా భారత వ్యతిరేకతను ప్రదర్శించి మయిజ్జూ గెలిచారు. చైనాకు అత్యంత అనుకూలుడని ఇతనికి పేరుంది. ఇప్పటికే ఆ దేశంలో ఉన్న 77 మంది భారత సైనికులను మీ దేశం వెళ్లాల్సిందిగా ఆదేశించాడు.
జమ్మూకాశ్మీర్ మంచు సోయగాలను చూసేందుకు అందరికీ ఆసక్తిగానే ఉంటుంది. అయితే శనివారం జమ్మూకాశ్మీర్ టూరిజం రోడ్‌షో నిర్వహించింది. ఈ సందర్భంగా పట్నిటాప్ టూరిజం డెవలప్‌మెంట్ అథారిటీ సీఈఓ షేర్ సింగ్ మాట్లాడుతూ.. ఈ సంవత్సరం జూన్ నుండి ఇప్పటివరకు 5.5 లక్షల మంది దేశీయ పర్యాటకులు జమ్మూకాశ్మీర్‌ను సందర్శించారని, వీరిలో 10 శాతం మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినట్లు ఆయన వెల్లడించారు. జమ్మూకాశ్మీర్‌కు తెలుగు రాష్ట్రాల నుంచి పర్యాటకుల తాకిడి పెరిగిందని ఆయన అభిప్రాయం వ్యక్తం…
భారత్ నుంచి ఎక్కువ మంది పర్యటనల కోసం మాల్దీవులకు వెళ్తుంటారు. అలా మాల్థీవులకు వెళ్లే భారత పర్యాటకులపై ఆ దేశం తాత్కాలికంగా నిషేదం విధించింది. భారత్‌లో కరోనా వ్యాప్తి అధికంగా ఉండటంతో ఆ దేశం ఈ నిర్ణయం తీసుకుంది. భారత్‌తో పాటు దక్షిణాసియా దేశాల్లో పర్యటించిన పర్యాటకులపై కూడా మాల్ధీవులు నిషేదం విధించింది. అన్ని రకాల వీసాలపై ఈ నిషేదం వర్తిస్తుందని ఆ దేశ ఇమ్మిగ్రేషన్ అధికారులు ట్వీట్ చేశారు. మే 13 నుంచి ఈ నిషేదం…