BRS MLAs: టీడీపీలో చేరుతాం.. క్లారిటీ ఇచ్చిన తీగల కృష్ణా రెడ్డి..
- ఏపీ సీఎం చంద్రబాబుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ..
- బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి- మర్రి రాజశేఖర్ రెడ్డి- మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సమావేశం..
- త్వరలో టీడీపీలో జాయిన్ అవుతానన్న తీగల కృష్ణారెడ్డి ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRS MLAs: ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రాబాబు నాయుడుతో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఇవాళ సమావేశం అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసంలో మల్లారెడ్డి భేటీ అయ్యారు. మల్లారెడ్డితో పాటు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ మేయర్ తీగల కృష్ణా రెడ్డిలు హాజరయ్యారు. బీఆర్ఎస్ నేతలు చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. మర్రి రాజశేఖర్ రెడ్డి కుమార్తె వివాహానికి ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించారు. అనంతరం బీఆర్ఎస్ నేతలు చంద్రబాబుతో పలు కీలక అంశాలపై చర్చించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సమావేశం ముగిసిన అనంతరం చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు.
Read also: Civil Supplies Department: డిజిటల్ హెల్త్ కార్డుల ఫార్మేట్‌తో ప్రభుత్వానికి సంబంధం లేదు
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
టీడీపీలో చేరుతాం.. తీగల కృష్ణా రెడ్డి..! మరి మల్లారెడ్డి..?
చంద్రబాబుతో భేటీ అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి లతో కలిసి మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడారు. త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు. తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం తీసుకొస్తానని ఉద్ఘాటించారు. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసింది చంద్రబాబు అని కొనియాడారు. చంద్రబాబు హయాంలో సైబరాబాద్, హైదరాబాద్ చాలా అభివృద్ధి చెందాయని తీగల కృష్ణా రెడ్డి కొనియాడారు. మరోవైపు మీడియాతో మాట్లాడకుండానే మల్లారెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోవడం చర్చకు దారి తీసింది. కాగా.. అయితే చామకూర మల్లారెడ్డి 2014 వరకు టీడీపీలో ఉన్న విషయం తెలిసిందే.. టీడీపీలో ఎంపీగా కూడా పనిచేశారు ఆయన. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో బీఆర్‌ఎస్‌లో చేరి మంత్రిగా పనిచేశారు. అయితే మరోసారి మల్లారెడ్డి టీడీపీలో చేరతారని వార్తలు వస్తున్నాయి. మల్లారెడ్డి టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం చర్చకు దారితీస్తోంది. ఇప్పుడు చంద్రబాబుతో మల్లారెడ్డి భేటీ హాట్ టాపిక్ గా మారింది.
Mallu Bhatti Vikramarka: సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కుల పంపిణీ చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!