Eknath Shinde: మహారాష్ట్ర గవర్నర్ వ్యాఖ్యల దుమారం.. స్పందించిన సీఎం ఏక్‌నాథ్ షిండే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eknath Shinde: ముంబయి ఆర్థిక స్థితి గురించి మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ చేసి వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారి తీశాయి. మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రేతో పాటు విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై వెంటనే గవర్నర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి స్పందించాలని కూడా కోరాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే స్పందించారు.
గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, ఆయన మాటలతో తాము ఏకభవించమని ముఖ్యమంత్రి షిండే అన్నారు. కోశ్యారీ రాజ్యాంగాబద్ధమైన పదవిలో ఉన్నారని.. ఇతరులను అవమానపరిచేలా మాట్లాడకూడదన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముంబైవాసులను తాము ఎప్పుడూ మరిచిపోమన్నారు. ముంబై అభివృద్ధి కోసం మరాఠీ ప్రజలు ఎంతో కృషి చేశారని ఏక్‌నాథ్ షిండే వెల్లడించారు. ముంబై ఎంతో ప్రాముఖ్యత కలిగిన నగరమని వెల్లడించిన సీఎం.. దేశం నలుమూలల నుంచి ఎంతో మంది ప్రజలు ముంబైని సొంత ఇంటిగా భావిస్తున్నప్పటికీ మరాఠీ ప్రజలు తమ గుర్తింపు, గౌరవాన్ని కాపాడుకున్నారని పేర్కొన్నారు. అలాంటి మరాఠీ ప్రజలను అవమానించకూడదన్నారు.
Also Read
- Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
- Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
Uddav Thackeray: మహారాష్ట్ర గవర్నర్ మరాఠీలను అవమానించారు.. రాజీనామాకు డిమాండ్!
శుక్రవారం మహారాష్ట్ర గవర్నర్ ముంబైలోని అంధేరీలో ఓ చౌక్‌కు శాంతిదేవి చంపలాల్జీ కొఠారీ పేరును పెట్టే కార్యక్రమంలో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేయడంతో దుమారం చెలరేగింది. ఆయన మాట్లాడుతూ.. ‘గుజరాతీలు, రాజస్థానీలు మహారాష్ట్ర నుంచి మరీ ముఖ్యంగా ముంబయి, ఠాణెను విడిచివెళ్లిపోతే.. ఈ రాష్ట్రంలో డబ్బేం మిగలదు. ముంబయి దేశ వాణిజ్య రాజధానిగా ఉండే అర్హత కోల్పోతుంది’ అని వ్యాఖ్యానించారు. వీటిని మహారాష్ట్ర నేతలు ఖండించారు. తన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో గవర్నర్ వివరణ ఇచ్చారు. మరాఠీ ప్రజల మనోభావాలు దెబ్బతీయాలనే ఉద్దేశం తనకు లేదన్నారు. దీనిపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే తీవ్రంగా స్పందించారు. ఆయన్ను ఇంటికి పంపాలా లేక జైలుకు పంపాలా అని నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చిందంటూ మండిపడ్డారు
తాజావార్తలు
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
-
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!