CP Radhakrishnan: ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్ రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేత ప్రమాణస్వీకారం చేయించనున్నట్లు అధికారులు తెలిపారు. రాష్టప్రతి భవన్‌లో ఉదయం 10 గంటలకు జరగనున్న కార్యక్రమంలో రాధాకృష్ణన్ తదుపరి ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేస్తారని వారు తెలిపారు.
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్రలో జూన్ 2022 రాజకీయ సంక్షోభంపై ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం తన ఉత్తర్వును ప్రకటించింది. ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వానికి పెద్ద ఊరటనిస్తూ, ఉద్ధవ్ థాకరే బలపరీక్షను ఎదుర్కోకుండా రాజీనామా చేసినందున ఆయన ప్రభుత్వాన్ని పునరుద్ధరించమని ఆదేశించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది.
గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే స్పందించారు. గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, ఆయన మాటలతో తాము ఏకభవించమని ముఖ్యమంత్రి షిండే అన్నారు. కోశ్యారీ రాజ్యాంగాబద్ధమైన పదవిలో ఉన్నారని.. ఇతరులను అవమానపరిచేలా మాట్లాడకూడదన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ముంబయి ఆర్థిక స్థితి గురించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారి తీశాయి. గుజరాతీలు, రాజస్థానీలను మహారాష్ట్ర నుంచి.. ముఖ్యంగా ముంబై, థానేల నుంచి పంపించేస్తే మహారాష్ట్రలో డబ్బే ఉండదన్నారు. దీంతో దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై తన పేరును కోల్పోతుందన్నారు. వారి వల్లే ముంబైకి ఆర్థిక రాజధానిగా పేరు వచ్చిందని పేర్కొన్నారు. దీనిపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే తీవ్రంగా స్పందించారు.
Maharashtra Governor Bhagat Singh Koshiyari controversy comments: గత కొంత కాలంగా మహారాష్ట్రలో రాజకీయాలు వాడీవేడీగా సాగుతున్నాయి. శివసేన నుంచి ఏక్ నాథ్ షిండే బయటకు రావడంతో పాటు తనతో పాటు 40కిపైగా ఎమ్మెల్యేలు ఉండటంతో ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి భారీ షాక్ తగిలింది. అనేక రాజకీయ పరిణామాల మధ్య ముఖ్యమంత్రిగా ఏక్ నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేశారు.