Varun Tej: చిరంజీవి కళ్ళల్లో ఆనందం చూడటమే నా ఏకైక లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొరియన్ కనకరాజు’ చిత్రం ఘనవిజయం సాధించడంతో, చిత్ర యూనిట్ నిర్వహించిన మెగా బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్ వేడుకలో హీరో వరుణ్ తేజ్ ఎమోషనల్ అయ్యారు. ఈ వేదికపై ఆయన తన ప్రయాణాన్ని, కుటుంబం అందించిన ప్రోత్సాహాన్ని గుర్తు చేసుకుంటూ అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ, తనకు సరైన సక్సెస్ వచ్చి ఏడేళ్లు అయినప్పటికీ ఆ గ్యాప్ ఎప్పుడూ తెలియకుండా మెగాస్టార్ చిరంజీవి చెప్పిన మాటలే తనకు కొండంత బలంగా నిలిచాయన్నారు. “కిందకి ఎన్నిసార్లు పడతాం, ఎలా పడతాం అనేది అసలు మ్యాటరే కాదు.. మనం మాత్రం కష్టపడుతూ ముందుకు వెళ్లాలంటూ డాడీ (నాగబాబు) చెప్పిన డిసిప్లిన్, హార్డ్‌వర్కే ఇవాళ నన్ను ఇక్కడ నిలబెట్టాయి” అని పేర్కొన్నారు. తన కెరీర్‌ను మలచడంలో కుటుంబ సభ్యుల పాత్ర ఎంతో ఉందని తెలిపారు.
ఈ చిత్ర దర్శకుడు మేర్లపాక గాంధీ తనలోని కొత్త యాంగిల్‌ను బయటకు తీసుకువచ్చి ఒక అద్భుతమైన కథతో సినిమాను తెరకెక్కించారని ప్రశంసించారు. అలాగే సంగీత దర్శకుడు తమన్ గురించి ప్రత్యేకంగా చెబుతూ, ప్రతి నెలా బ్లాక్‌బస్టర్స్‌తో అలరించే తమన్.. ఈ సినిమాకి తన హార్ట్ అండ్ సోల్ పోర్ట్ చేసి అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారంటూ కొనియాడారు. ఇక ఈ సినిమాలో తనతో కలిసి ప్రయాణించిన సహనటుడు సత్యను ఈ సందర్భంగా మిస్ అవుతున్నట్లు చెప్పారు. అమలాపురం నుంచి తన కుటుంబం మొత్తాన్ని తీసుకొస్తానని సత్య ఎంతో ఉత్సాహంగా చెప్పినప్పటికీ, షూటింగ్ బిజీ వల్ల రాలేకపోయాడని, తమరిద్దరి మధ్య బంధం నిజమైన అన్నదమ్ముల లాంటిదని గుర్తు చేసుకున్నారు.
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
తన పెద్దనాన్న చిరంజీవి సంపాదించిన పేరుకు ఎప్పుడూ భంగం కలిగించకూడదని, అమ్మనాన్నల కళ్ళల్లో ఎప్పుడూ గౌరవం, బాబాయ్ పవన్ కళ్యాణ్, చిరంజీవి కళ్ళల్లో ఆనందం చూడటమే తన ఏకైక లక్ష్యమని వరుణ్ తేజ్ తెలిపారు. చివరగా, తనకు చిన్నప్పటి నుంచి ఆగస్ట్ 22 అంటే ఒక నేషనల్ హాలిడే లాంటిదని, స్కూల్‌కి వెళ్లకుండా నేరుగా పెద్దన్న గారి ఇంటికి వెళ్లేవాడినని గుర్తుచేసుకున్నారు. ఆగస్ట్ 22న రాబోతున్న మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా, ఇక్కడ ఉన్న అందరి తరఫున, టీవీల్లో చూస్తున్న అభిమానుల అందరి తరఫున ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ వరుణ్ తేజ్ తన ప్రసంగాన్ని ముగించారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!