Governor bhagat singh koshyari Apologises For Gujaratis-Rajasthanis comments: మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు. ఇటీవల ఓ కార్యక్రమంలో గుజరాతీలు, రాజస్థానీలు థానే, ముంబై, మహారాష్ట్ర నుంచి వెళ్లిపోతే ఇక్కడ డబ్బులు మిగలవని.. ఇక ముంబై ఆర్థిక రాజధానిగా ఉండబోదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం,
గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే స్పందించారు. గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, ఆయన మాటలతో తాము ఏకభవించమని ముఖ్యమంత్రి షిండే అన్నారు. కోశ్యారీ రాజ్యాంగాబద్ధమైన పదవిలో ఉన్నారని.. ఇతరులను అవమానపరిచేలా మాట్లాడకూడదన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ముంబయి ఆర్థిక స్థితి గురించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారి తీశాయి. గుజరాతీలు, రాజస్థానీలను మహారాష్ట్ర నుంచి.. ముఖ్యంగా ముంబై, థానేల నుంచి పంపించేస్తే మహారాష్ట్రలో డబ్బే ఉండదన్నారు. దీంతో దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై తన పేరును కోల్పోతుందన్నారు. వారి వల్లే ముంబైకి ఆర్థిక రాజధానిగా పేరు వచ్చిందని పేర్కొన్నారు. దీనిపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే తీవ్రంగా స్పందించారు.
మహారాష్ట్రలో కొత్త ముఖ్యమంత్రిగా ఏక్ నాథ్ షిండే, డిప్యూటీగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేశారు. అయితే ప్రమాణ స్వీకార సమయంలో సీఎం, డిప్యూటీ సీఎంలకు గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ స్వీట్లు తినిపించడం, పుష్పగుచ్చాలు ఇవ్వడం ఇప్పుడు వైరల్ గా మారాయి. అయితే ఈ వివాదంపై ఎన్సీపీ నేత శరద్ పవార్ స్పందించారు. నేను ఎన్నో ప్రమాణస్వీకారాలను చూశానని.. ఇలా ప్రమాణం చేసిన వారికి గవర్నర్ స్వీట్లు తినిపించడం, పువ్వులు ఇవ్వడం ఎప్పుడు చూడలేదని ఆయన అన్నారు.…
మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే శివసేనకు చెందిన 39 మంది ఎమ్మెల్యేలు మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నామని చెబుతున్నారు. వీరంతా శివసేన రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే ఆధ్వర్యంలో గౌహతిలో ఉన్నారు. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ నెమ్మదిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే బీజేపీ నేత, మాజీ సీఏం దేవేంద్ర ఫడ్నవీస్, రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే రహస్యంగా సమావేశం అయినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో రానున్న రోజుల్లో…