మావోయిస్ట్ అగ్ర నేత మల్లోజుల వేణుగోపాల్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఎదుట లొంగిపోయారు. గడ్చిరోలిలో 60 మంది ఉద్యమ సహచరులతో కలిసి మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయారు. ముఖ్యమంత్రికి ఒక్కొక్కరిగా వచ్చి ఆయుధాలు అందజేశారు.
ముంబైలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. దొంగతనానికి వచ్చిన అగంతకుడు.. సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి చేయగా.. ఆరు కత్తిపోట్లు పడ్డాయి.
నూతన సంవత్సరం వేళ మహారాష్ట్రలో కీలక పరిణామం జరిగింది. గడ్చిరోలి పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట తారక్క సిదాం సహా 11 మంది మావోయిస్టులు బుధవారం లొంగిపోయారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈరోజు అహల్యా నగర్‌లో సీనియర్ సామాజిక కార్యకర్త, పద్మభూషణ్ అన్నా హజారేతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫడ్నవీస్ అన్నా హజారేతో భేటీ కావడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా సీఎం ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్ కూడా ఉన్నారు. సీఎం దేవేంద్ర తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో దీనికి సంబంధించిన చిత్రాలు, వీడియోను పంచుకున్నారు.
మహారాష్ట్ర కొత్త ప్రభుత్వం గురువారం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం చేశారు. ఫడ్నవిస్‌తో పాటు డిప్యూటీ సీఎంలుగా అజిత్ పవార్, ఏక్‌నాథ్ షిండే ప్రమాణం చేశారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం చేశారు. ముచ్చటగా మూడోసారి గురువారం సీఎంగా ప్రమాణం చేశారు. ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం ఒక పేషెంట్‌కు ఆర్థిక సాయంపై చేశారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం చేశారు. ముచ్చటగా మూడోసారి ఫడ్నవిస్ సీఎంగా ప్రమాణం చేశారు. గురవారం ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఫడ్నవిస్ చేత గవర్నర్ రాధాకృష్ణన్ ప్రమాణం చేయించారు.
తాను సావర్కర్ కానందున క్షమాపణ చెప్పబోనని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ప్రత్యర్థులైన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, శివసేన అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మధ్య ఐక్యతకు దారితీసింది. కాగా, 2019 పరువు నష్టం కేసులో గుజరాత్‌లోని సూరత్‌లోని కోర్టు గాంధీని దోషిగా నిర్ధారించిన మరుసటి రోజు, శుక్రవారం లోక్‌సభకు గాంధీ అనర్హుడయ్యాడు.
గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే స్పందించారు. గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, ఆయన మాటలతో తాము ఏకభవించమని ముఖ్యమంత్రి షిండే అన్నారు. కోశ్యారీ రాజ్యాంగాబద్ధమైన పదవిలో ఉన్నారని.. ఇతరులను అవమానపరిచేలా మాట్లాడకూడదన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.