HCL: HCL వ్యవస్థాపకుడు శివ్ నాడార్ తన వాటాలో 47 శాతాన్ని కూతురు రోష్ని నాడార్ మల్హోత్రాకు గిఫ్ట్‌గా ఇచ్చారు. వ్యూహాత్మక వారసత్వ ప్రణాళికలో భాగంగా, HCL గ్రూప్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్, గ్రూప్ ప్రమోటర్ సంస్థలు అయిన HCL కార్ప్, వామ సుందరి ఇన్వెస్ట్‌మెంట్స్ (వామ ఢిల్లీ)లో తన వాటాలో 47% తన కుమార్తె రోష్ని నాడార్ మల్హోత్రాకు బహుమతిగా ఇచ్చారు. ఫోర్బ్స్ రియల్-టైమ్ బిలియనీర్ల జాబితా 2025 ప్రకారం.. శివ్ నాడార్ నికర విలువ $34.4 బిలియన్లుగా ఉంది, ఆయనను ప్రపంచంలోని 52వ ధనవంతుడిగా పేర్కొంది.
ఈ బదిలీతో $12 బిలియన్ల టెక్నాలజీ కంపెనీకి సంబంధించిన అన్ని వ్యూహాత్మక నిర్ణయాలకు రోష్ని నాడార్ బాధ్యత వహిస్తారు. ఆమె రెండు సంస్థల నియంత్రణను సొంతం చేసుకుంటుంది. వామా ఢిల్లీ, HCL కార్ప్‌లో మెజారిటీ వాటాదారు అవుతుంది. ఈ నిర్ణయంతో ఆమె వామా ఢిల్లీలో 44.17% వాటాతో, HCL కార్ప్ 0.17% వాటాతో ముడిపడి ఉన్న ఓటింగ్ హక్కులపై కూడా నియంత్రణ పొందుతారు. HCL ఇన్ఫోసిస్టమ్స్‌లో వామా ఢిల్లీకి ఉన్న 12.94% వాటాతో పాటు HCL కార్ప్‌కు ఉన్న 49.94% వాటాపై ఓటు హక్కును కలిగి ఉంటారు.
Read Also: TG GOVT: నేతన్నలకు తీపికబురు.. ఒక్కో కార్మికుడికి రూ.లక్ష రుణమాఫీ చేస్తూ ప్రభుత్వం జీఓ
వారసత్వాన్ని క్రమబద్ధీకరించడానికి ఉద్దేశించి ప్రైవేట్ కుటుంబ ఏర్పాటు ప్రకారం గిఫ్ట్ డీడ్‌లు అమలు చేశారు. ఇది శివ్ నాడర్ కుటుంబం(ప్రమోటర్ కుటుంబం) యాజమాన్యం, నియంత్రణను కొనసాగిస్తుంది. కంపెనీకి కావాల్సిన స్థిరత్వాన్ని అందిస్తుంది. ఈ నిర్ణయం ద్వారా శివ్ నాడార్, రోష్ని నాడార్ మల్హోత్రాలు వామా ఢిల్లీ, హెచ్‌సీఎల్ కార్ప్ రెండింటిలో వరసగా 51 శాతం, 10.33 శాతం వాటాను కలిగి ఉంటారు. ‘‘ఈ గిఫ్ట్ డీడ్‌ల ద్వారా, శివ్ నాడార్ వామా ఢిల్లీ మరియు కంపెనీ ప్రమోటర్/ప్రమోటర్ గ్రూప్ అయిన HCL కార్ప్ రెండింటిలోనూ 47% వాటాను తన కుమార్తె శ్రీమతి రోష్ని నాడార్ మల్హోత్రాకు బదిలీ చేయడానికి అంగీకరించారు. ఈ బదిలీ తర్వాత, ఆమె నియంత్రణను పొంది వామా ఢిల్లీ మరియు HCL కార్ప్‌లో మెజారిటీ వాటాదారుగా మారుతుంది’’ అని కంపెనీ వెల్లడించింది.
శివ్ నాడార్ జూలై 2020లో తన కుమార్తెకు పగ్గాలు అప్పగించారు. దీంతో ఆమె భారతీయ ఐటీ కంపెనీకి మొదటి మహిళా చైర్‌పర్సన్‌గా మారారు. శివ్ నాడార్ జూలై 2021లో HCL టెక్నాలజీస్ మేనేజింగ్ డైరెక్టర్ పదవికి కూడా రాజీనామా చేశారు, ఆ తర్వాత HCL టెక్నాలజీస్ CEO అయిన సి విజయకుమార్ ఐదు సంవత్సరాల కాలానికి మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు.
రోష్ని నాడార్ మల్హోత్రా వివరాలు:
రోష్ని నాడార్ మల్హోత్రా HCLTech చైర్‌పర్సన్ , దాని CSR బోర్డు కమిటీ చైర్‌పర్సన్.ఆమె శివ్ నాడార్ ఫౌండేషన్ కు ట్రస్టీగా కూడా ఉన్నారు. ఈ ట్రస్ట్ భారతదేశంలోని అగ్రశ్రేణి కాలేజీలు, పాఠశాలల్ని స్థాపించింది. HCLలో చేరడానికి ముందు, రోష్ని నాడార్ న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు. కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుండి ఎంబీఏ పట్టా పొందారు. ఆమె నార్త్ వెస్ట్రన్ విశ్వవిద్యాలయం నుండి కమ్యూనికేషన్స్‌లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉన్నారు.