Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ‘‘లవ్ జిహాద్’’ చట్టం అవసరాన్ని చెప్పారు. దాదాపు లక్ష కేసులు ఈ విధంగా నమోదైనట్లు వెల్లడించారు. ఈ కేసులను మొదట్లో మతాంతర వివాహాలుగా చూసినప్పటికీ, పురుషులు వివాహానికి ముందు తమ గుర్తింపుని దాచిపెట్టి, పిల్లలు పుట్టిన తర్వాత తమ భార్యలను విడిచిపెడుతున్నారని పేర్కొన్నారు. ఈ స్త్రీలలో చాలా మందిని వారి కుటుంబాలు తిరస్కరిస్తున్నాయని, వారి జీవితాలు విధుల పాలవుతున్నాయని చెప్పారు.