T Congress: తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (డబ్ల్యూసీ) సూత్రప్రాయంగా నిర్ణయించింది. సెప్టెంబరు 16, 17, 18 తేదీల్లో హైదరాబాద్ శివార్లలో సీడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.దీనికి సంబంధించిన ఏర్పాట్లకు కూడా ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే, సమావేశ తేదీలు మారవచ్చు. ఈసారి ఎలాగైనా తెలంగాణ సాధించాలని కాంగ్రెస్ పార్టీ పట్టుదలతో ఉంది. కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధించి ఉత్సాహంగా ఉన్న హస్తం పార్టీ తెలంగాణలో అడుగుపెట్టేందుకు ఇదే సరైన సమయమని భావిస్తోంది. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఊపు తెచ్చేందుకు సీడబ్ల్యూసీ సమావేశాన్ని ఇక్కడే నిర్వహించాలని యోచిస్తున్నారు.
Read also: Pragyananda Meet PM: ప్రధానిని కలిసిన యువ చెస్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న వారి నుంచి తాజాగా దరఖాస్తులను ఆహ్వానించారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూడా ముగియనుంది. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 17న అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయాలని టీ కాంగ్రెస్ ఎప్పటి నుంచో అనుకుంటున్నది. సోనియా గాంధీ చేతుల మీదుగా మేనిఫెస్టో విడుదల చేయాలని భావించారు. అయితే హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశాలు పెడితే.. కాంగ్రెస్ నేతలందరి సమక్షంలో మేనిఫెస్టో విడుదల చేయవచ్చని రేవంత్ రెడ్డి ప్లాన్. అందుకే హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహించేలా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఒప్పించినట్లు తెలుస్తోంది. సీడబ్ల్యూసీ సమావేశాల ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించి, ఆ సమావేశంలోనే తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయాలని టీపీసీసీ యోచిస్తోంది.
Read also: Jamili election: జమిలి ఎన్నికలు.. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ!
పార్లమెంట్ ప్రత్యేక సమావేశం రూపంలో సీడబ్ల్యూసీ సమావేశాలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ యోచిస్తోందని, అందుకే ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తోందని ప్రచారం జరుగుతోంది. దీంతో పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాతే సీడబ్ల్యూసీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. తేదీలు మారినప్పటికీ సీడబ్ల్యూసీ సమావేశాలను హైదరాబాద్‌లోనే నిర్వహించాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం పట్టుదలతో ఉంది.
TS RTC: తెలంగాణ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం.. టీ-9 టికెట్ సెప్టెంబర్ 4 వరకు ఇవ్వరు..!